NHB Recruitment 2021: నేషనల్ హౌజింగ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం తాజాగా ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజైంది. సీనియర్ మేనేజ్‌మెంట్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 60 శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 32 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది.
Also Read: ఏపీలో 1317 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్.. మంచి జీతంతో?
పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తారు. 2021 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 60,000 రూపాయల నుంచి 1,26,954 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://nhb.org.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.