https://oktelugu.com/

Bigg Boss 5: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో టికెట్ టు ఫీనాలే గెలిచింది అతడే…

Bigg Boss 5: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ టి‌ఆర్‌పి పరంగా దూసుకుపోతూ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. హౌస్ మేట్స్ అంతా తమ శైలిలో అదరగొడుతున్నారు. ఇప్పటికీ స‌క్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్… చివరి అంకానికి త్వరలోనే చేరనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని అంతా ఆసక్తిగా ఎరురుచుస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 4, 2021 / 09:16 AM IST
    Follow us on

    Bigg Boss 5: తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 5. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ టి‌ఆర్‌పి పరంగా దూసుకుపోతూ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది. హౌస్ మేట్స్ అంతా తమ శైలిలో అదరగొడుతున్నారు. ఇప్పటికీ స‌క్సెస్ ఫుల్‌గా 12 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్… చివరి అంకానికి త్వరలోనే చేరనుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని అంతా ఆసక్తిగా ఎరురుచుస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే పోటీదారులు సిరి, మానస్, సన్నీ, శ్రీరామ్‌లకు ఫోకస్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. నలుగురికి నాలుగు పలకలు ఇచ్చి పలు రకాల శబ్దాలను వినిపించి… వాటిని కనిపెట్టాలని చెప్పారు. ఈ తరుణంలో కాజల్ మానస్ కి, షణ్ముఖ్ సిరికి… ప్రియాంక శ్రీరామ్‌కి హెల్ప్ చేస్తుండడంతో బిగ్ బాస్ వారిని హెచ్చరించి సహాయం చేయొద్దని చెప్పారు.

    Bigg Boss 5

    Bigg Boss 5

    ఆ తర్వాత సైగలు చేస్తూ ఇంటి సభ్యులకు కాజల్ ఇబ్బందిగా మరడంతో సన్నీ కాజల్‌పై సీరియస్ అవుతాడు. ఇది టికెట్టు ఫినాలే మచ్చా మజాకా కాదు.. నువ్వు ఇక్కడ ఉండకు అంటూ సీరియస్ అయ్యాడు. సిరి బిగ్ బాస్ బోర్డ్‌లు చూపించండి అని చెప్పిన తర్వాత పక్కవాళ్ళ పలక చూసి రాసింది. దాంతో బిగ్ బాస్ రాసింది చెరిపేయాలని సిరికి చెబుతారు. సౌండ్ వచ్చినప్పుడల్లా కాజల్ ఆన్సర్స్ చెప్పేస్తుంది… దాంతో శ్రీరామ్ కూడా సీరియస్ అయ్యాడు. ఇక సన్నీ, శ్రీరామ్ ఎంత చెప్పిన కాజల్ వినకుండా నేను మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా… బిగ్ బాస్ మాట్లాడొద్దని చెప్పలేదు అంటూ వాదించింది. చివరకు ఈ టాస్క్‌లో ఏడుసార్లు కరెక్ట్‌గా రాసిన మానస్ – సన్నీలు విజేతలుగా నిలుస్తారు.

    Also Read: బిగ్ బాస్ లో షన్ను ని కాదని వేరే కంటస్టెంట్ కి మద్దతు తెలుపుతున్న దీప్తి సునైనా…

    ఇక మొత్తంగా ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి మానస్ 29 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా… 28 పాయింట్లతో శ్రీరామ్ రెండో స్థానంలో.. 24 పాయింట్లతో సిరి మూడో స్థానంలో … 23 పాయింట్లతో సన్నీ నాలుగో స్థానంలో నిలిచారు. దీంతో సన్నీ, సిరి టికెట్ టు ఫినాలే పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు మానస్, శ్రీరామ్ నిలిచారు. బరువైన బ్యాగ్‌కి తాడు కట్టి దాని సాయంతో కింద ఉన్న బ్లేట్స్‌ని ఇరగ్గొట్టుకుంటూ రావాల్సి ఉంది. అయితే మానస్ బ్యాగ్ కడ్డీలో ఇరుక్కుని పోవడంతో శ్రీరామ్ ఈ టాస్క్‌లో గెలిచి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు.

    Also Read: నిజాలు బయటపెడితే అందరూ షాక్ అవుతారు.. జరిగేది వేరు చూపించేది వేరు