Stairs: కొన్ని సందేహాలు ఎప్పటికీ తీరవు. కానీ కొన్నింటికి మాత్రం వెతికితే సమాధానం దొరుకుతుంది. మరికొన్నింటికి కోరా వెబ్ సైట్ లో సమాధానం దొరుకుతుంది. ఇందులో ఎలాంటి ప్రశ్నకు అయినా ఎవరో ఒకరు సమాధానం ఇస్తుంటారు. అయితే పాతం కాలం కట్టడాలను గమనిస్తే మెట్లు చాలా వింతగా ఉంటాయి. వంకర టింకర గా ఉంటూ పైకి వెళ్లడానికి అయినా కిందకు దిగడానికి అయినా ఇబ్బందిగానే ఉంటుంది. మరి ఇలాంటి మెట్లను ఎందుకు కట్టారు? వీటి వెనుక రహస్యం ఏంటి అనుకుంటున్నారా?
క్లాక్ వైస్ లో ఇరుకుగా ఉండే మెట్లు మీరు చాలా ప్రాంతాల్లో చూసే ఉంటారు. చార్మినార్ వెళ్తే పైకి వెళ్లడానికి అచ్చం ఇలాంటి మెట్లు ఉంటాయి. ఇక పురాతన బావిలోకి దిగడానికి కూడా ఇలాంటి మెట్లే ఉంటాయి. మరి వీటికి అర్థం ఏమిటి? ఎందుకు ఇలా కట్టారు? అనే వివరాలు మనం తెలుసుకుందాం. పూర్వం శత్రువులు దాడి చేయడానికి వస్తే వారు పైకి రావడానికి చాలా సమయం పట్టేలా, ఇబ్బందిగా అనిపించేలా ఉండాలని ఇలాంటి మెట్లు కట్టారట. చాలా మందికి కుడి చేయి వాటం ఉంటుంది.
పైకి రావాలంటే ప్రతి ఒక్కరు ఈ మెట్ల మలుపును దాటుకుంటూ రావాలి. అంటే ఈ సమయంలో శత్రువులు దొరికిపోయే అవకాశం కూడా ఉంటుంది. తమను తాము రక్షించుకోవడానికి వీరు వచ్చే వరకు ఒక గోడను రక్షణ కవచంగా పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ఒక పెద్ద బండరాయిని, లేదంటే మరేదైనా ఇతర గోడ వంటి దానిని వీరు వచ్చే లోపే పెట్టుకోవచ్చు. అక్కడి నుంచే అటాక్ చేయాలి అనుకున్నా కూడా శత్రువులకు సాధ్యం కాదు. మెట్లు సమాంతరంగా లేకపోవడం వల్ల బ్యాలెన్సింగ్ తప్పతుంది.
ఇలా శత్రువుల నుంచి తప్పించుకోవడానికి మెట్లను ఇలా డిజైన్ చేసేవారట. అయితే దీని వెనకాల ఉన్న రీజన్ తెలియకపోయినా ఇప్పటికి కూడా కొంత మంది రకరకాల మెట్ల డిజైన్ ను వాడుతుంటారు. ఇలాంటి మెట్లు మాత్రం పాత బిల్డింగ్ లు ఏవైనా కోటలు, కట్టడాలలో మాత్రమే కనిపిస్తాయి.