Neninthe Heroine: రవితేజ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఎన్నో అంచానాల మధ్య వచ్చిన నేనింతే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సియా గౌతమ్. ఆమె అసలు పేరు అధితి గౌతమ్ కానీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి పరిచయం అయింది. 2008లో వచ్చిన నేనింతే మూవీతో ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. అప్పట్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమాలో సంధ్య అనే పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసింది. అసలు ఇప్పుడు ఈ అమ్ముడు ఎలా ఉందో చూస్తే గుర్తు పట్టడం కష్టం అనే చెప్పవచ్చు.
2010లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రంలో కూడా నటించింది సియా గౌతమ్. అయితే ఆ సినిమా సక్సెస్ ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు అనే చెప్పాలి. ఈ సినిమా సియా కు అవకాశాలను కూడా తెచ్చిపెట్టలేదు. అందం, అభినయం ఉంటే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావు, అదృష్టం కూడా కావాలని ఈమెతో మరోసారి రుజువైంది. దీంతో వేదం తర్వాత సియా గౌతమ్ మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే 2011 లో కన్నడంలో ఓ సినిమా చేసిన ఈ అమ్ముడుకు సుమారు 7 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో సంజూ మూవీ రూపంలో ఛాన్స్ దక్కింది అని చెప్పాలి. దీని తర్వా కూడా ఆఫర్లు రావడం లేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తున్న ఈ భామ యూట్యూబ్ లో ఓ ఛానెల్ నడిపిస్తోంది. తన అన్నయ్యకు సంబందించిన బిజినెస్ లు చూసుకుంటూ ముంబైలోనే కుటుంబంతో కలిసి ఉంటుంది సియా.
ఎంత బిజీగా ఉన్న సినీ ఇండస్ట్రీ పై ఉన్న ఇష్టంతో ఖాళీ దొరికినప్పుడు ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలా వచ్చిన ఆఫర్ పక్కా కమర్షియల్ చిత్రంలో ఓ పాత్ర పోషించేలా చేసింది. చిన్న పాత్రే అయినా ఈ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇంతే కాకుండా ఈ నటి మరో మహాభారతం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా లేడీ ఓరియెంటెండ్ సినిమా. జగదీష్ దుగాన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మించారు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో కూడిని ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. కానీ ఈ సినిమాతో కూడా సియాకు ఊహించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదు. పెద్ద ప్రాజెక్ట్ లలో నటించే అవకాశం తెప్పించలేదు.
అయితే ఇలా ఎంతో మంది వెండితెరపై బుల్లితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగి కొన్ని రోజులు తర్వాత కనుమరుగవుతుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే మరో సినిమా ఆఫర్ వస్తుంది అనేది ఎంత నిజమో.. కొన్ని రోజుల తర్వాత ఇండస్ట్రీలోనే ఉండకుండా అవుతున్నారు అనేది అంతే నిజం. ప్రేక్షకులు ఎప్పుడు కొత్త దనాన్ని కోరుకోవడం, కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేయడం, వారి బడ్జెట్ కూడా తక్కువగా ఉండడంతో నిర్మాతలు పాత వారికంటే కొత్త వారికి ఎక్కువ ఛాన్సులు ఇస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో రాణించేవారు చాలా తక్కువ అనే చెప్పాలి. ఇందులో మరీ ముఖ్యంగా హీరోయిన్లు. హీరోలకు ఎప్పటికి అప్పుడు క్రేజ్ పెరుగుతూనే ఉంటుంది. కానీ హీరోయిన్లకు ఎప్పుడు క్రేజ్ తగ్గుతూనే ఉంటుంది అనడానికి సియా గౌతమ్ కూడా ఒక ఉదాహరణనే అని అంటున్నారు ఈమె అభిమానులు.