Mahesh Babu Sudheer Babu: మహేష్ బాబు ఎందుకు సుధీర్ బాబు ను పట్టించుకోవడం లేదు…

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఇక భారీ గుర్తింపును సంపాదించుకుంటున్న చాలా మంది వరుస సక్సెస్ లాంగ్ అందుకుంటూ ముందుకు వెళ్తున్నారు... నిజానికి నెపోటిజం ఉన్న హీరోలందరూ వాళ్ళ సినిమాలను ఎంకరేజ్ చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు...

Written By: Neelambaram, Updated On : October 12, 2024 4:20 pm
Follow us on

Mahesh Babu Sudheer Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెడుతుంటాయి. అందువల్లే ఆయన సినిమాలకు మంచి క్రేజ్ అయితే దక్కుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు చేతిలో మహేష్ బాబు పడడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

కానీ ఆయన డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతోనే స్టార్ డమ్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప పేరును సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే డిఫరెంట్ అటెంప్ట్ చేస్తూ భారీ విజయాన్ని సాధించడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి తను అనుకున్నట్టుగానే సినిమాలు చేస్తున్నప్పటికి ఆయనకు భారీగా సక్సెస్ లు మాత్రం రావడం లేదు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన ‘మా నాన్న సూపర్ హీరో’ అనే సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి కలెక్షన్ల పరంగా మాత్రం అంత పెద్ద వసూళ్లనైతే రాబట్టడం లేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఇంట్లో ఉన్నప్పటికి సుధీర్ బాబు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూ వస్తున్న సుధీర్ బాబుకి మహేష్ బాబు ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. కనీసం ఆయన సినిమా బాగుంటే ఒక చిన్న ట్వీట్ చేసి అతన్ని ప్రమోట్ చేయొచ్చు కదా!

లేదంటే సక్సెస్ ఈవెంట్ కి హాజరై ఆ సినిమాని ఇంకా ప్రమోట్ చేస్తే మంచి సక్సెస్ దక్కుతుంది. తద్వారా సుధీర్ బాబు కూడా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలైతే ఉన్నాయి. కదా అని చాలామంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.