https://oktelugu.com/

Mokshagna: మోక్షజ్ఞ చేత భారీ యాక్షన్ చేయించబోతున్న బాలయ్య !

Mokshagna: ‘అఖండ’తో బాలయ్య ప్రభ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర వెలిగిపోతుంది. ఒకప్పుడు, బాక్సాఫీస్ బొనాంజా అని బాలయ్యకి బిరుదు ఉండేది. అయితే, గత కొన్నేళ్లుగా బాలయ్య ఆ బిరుదుకు న్యాయం చేయలేకపోయాడు. కానీ, అఖండతో అఖండమైన విజయం సాధించి ఒక విధంగా బాక్సాఫీస్ పై దండయాత్రనే చేశాడు. దాంతో బాలయ్యకి భారీ విజయం దక్కినట్టు అయింది. ఇప్పుడు అఖండ ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య వేగం పెంచాడు, అలాగే వారసుడిని కూడా సిద్ధం చేస్తున్నాడు. అసలు నటసింహం బాలయ్య […]

Written By:
  • Shiva
  • , Updated On : December 17, 2021 / 07:05 PM IST
    Follow us on

    Mokshagna: ‘అఖండ’తో బాలయ్య ప్రభ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర వెలిగిపోతుంది. ఒకప్పుడు, బాక్సాఫీస్ బొనాంజా అని బాలయ్యకి బిరుదు ఉండేది. అయితే, గత కొన్నేళ్లుగా బాలయ్య ఆ బిరుదుకు న్యాయం చేయలేకపోయాడు. కానీ, అఖండతో అఖండమైన విజయం సాధించి ఒక విధంగా బాక్సాఫీస్ పై దండయాత్రనే చేశాడు. దాంతో బాలయ్యకి భారీ విజయం దక్కినట్టు అయింది.

    Mokshagna

    ఇప్పుడు అఖండ ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య వేగం పెంచాడు, అలాగే వారసుడిని కూడా సిద్ధం చేస్తున్నాడు. అసలు నటసింహం బాలయ్య బాబు పేరు చెబితేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి, ఇక బాలయ్య డైలాగ్ లకు థియేటర్స్ డైనమెట్ పేలినట్లు దద్దరిల్లిపోతాయి. అలాంటి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అంటే ఇక ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు ?

    నిజానికి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడు బాలయ్య. కెమెరా ముందుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించని తన కొడుకు మోక్షజ్ఞ చేత, భారీ యాక్షన్ చేయించబోతున్నాడు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయట.

    Also Read: Jayasudha: ఒకేసారి ఆ దిగ్గజ దర్శకులిద్దరూ ఆమె కోసం పోటీ పడేవారు !

    ఎలాగూ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం పై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా బోయపాటి శ్రీను పేరు వినిపిస్తోంది. పైగా అఖండ భారీ విజయం సాధించింది. కాబట్టి.. వచ్చే ఏడాది బోయపాటి దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి చిత్రంను ఖాయం చేశారు. మొత్తమ్మీద నందమూరి అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నారు.

    ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్షన్ సినిమాలు చేయడానికి కావాల్సిన కసరత్తులు చేస్తున్నాడు. వచ్చే సమ్మర్ కి మోక్షజ్ఞ మొదటి సినిమాని అధికారికంగా లాంచ్ చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు.

    Also Read: Radhe Shyam: రాధే శ్యామ్ సినిమాలో ఆ సీక్రెట్ ని రివీల్ చేసిన… డైరెక్టర్ రాధా కృష్ణ

    Tags