Director Krish Remuneration: టాలీవుడ్ లో మంచి ప్రతిభ ఉన్న దర్శకులలో ఒకరు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi). ఆయన సినిమాలకు మార్కెట్ లో ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. జనాలు ఆయన సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అలాంటి క్రిష్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లాంటి సూపర్ స్టార్ తో చేతులు కలిపితే అంచనాలు ఏ రేంజ్ లో ఏర్పడుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీళ్ళ కాంబినేషన్ లో ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) అనే పీరియడ్ చిత్రం తెరకెక్కబోతుంది అనే వార్త రాగానే అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పై అంచనాలు భారీగా పెంచుకున్నారు. కానీ అనేక కారణాల చేత ఈ సినిమా వాయిదా పడుతూ రావడం వల్ల క్రిష్ కి కూడా వేరే కమిట్మెంట్స్ ఉండడం తో ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఎప్పుడైతే ఈ సినిమా నుండి క్రిష్ తప్పుకున్నాడో, అప్పటి నుండి ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పడిపోయాయి.
మళ్ళీ అంచనాలను తిరిగి తీసుకొని రావడానికి చాలా కష్టమైంది. ఇప్పటికీ ఈ చిత్రం పై ఆడియన్స్ లో మొదట్లో ఉన్న క్రేజ్ అయితే కచ్చితంగా లేదు. అయితే ఈ చిత్రానికి క్రిష్ దాదాపుగా వంద రోజులకు పైగా పని చేసాడు. సుమారుగా 70 శాతం కి పైగా షూటింగ్ ని ఆయనే పూర్తి చేసాడు. మనకి థియేట్రికల్ ట్రైలర్ లో చూపించిన షాట్స్ లో అత్యధిక శాతం క్రిష్ తెరకెక్కించినవే ఉన్నాయి. వాటికే ఫ్యాన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రానికి క్రిష్ వంద రోజులకు పైగా పని చేశాడు కదా, ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతనో ఊహించగలరా?, కేవలం రెండు కోట్ల రూపాయిల అడ్వాన్స్ మాత్రమే అట క్రిష్ తీసుకున్నది. ఆ తర్వాత AM రత్నం నుండి ఆయనకు ఎలాంటి రెమ్యూనరేషన్ అందలేదు.
Also Read: నిమిషానికి 1,00,000 గ్రాస్.. హైదరాబాద్ లో ‘హరి హర వీరమల్లు’ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!
కనీసం సినిమా విడుదల తర్వాత అయినా ఇస్తాడేమో చూద్దాం. 70 శాతం షూటింగ్ చేసిన తర్వాత కూడా, మీరు ఒకేవలె నా పేరు తీసేసి మీ అబ్బాయి పేరు మాత్రమే పెట్టుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడట. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈయన వస్తాడని అందరూ అనుకున్నారు కానీ, ఎందుకో రాలేకపోయాడు. కానీ నేడు ఉదయం మాత్రం ఈ సినిమా గురించి ఒక భారీ ట్వీట్ వేసాడు. ఫ్యాన్స్ నుండి ఈ ట్వీట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రిష్ ఈ చిత్రం కోసం చాలా రీసెర్చ్ చేశాడు. ఎన్నో పుస్తకాలను చదివాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ నే ఆయన ఒక యజ్ఞం లాగా చేశాడు. ఆ ఔట్పుట్ మొత్తం అద్భుతంగా వచ్చి ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఔట్పుట్ నిజంగా ఉందా లేదా అనేది.