Hari Hara Veeramallu Bookings: అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల నుండి నెమ్మదిగా ప్రారంభిస్తూ వచ్చారు. కాసేపటి క్రితమే నైజాం ప్రాంతం లో పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ముందుగా డిస్ట్రిక్ట్ యాప్ లో కొన్ని థియేటర్స్ వరకు బుకింగ్స్ మొదలు పెట్టారు. మొదటి రెండు గంటల్లోనే 22 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక కాసేపటి క్రితమే బుక్ మై షో యాప్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. దీనికి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. బుక్ మై షో యాప్ లో గంటకు 14 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు కేవలం గంటలోనే కోటి రూపాయలకు పైగా వచ్చిందని చెప్తున్నారు.
బుక్ మై షో యాప్ లో కోడింగ్ సిస్టం ద్వారా గ్రాస్ ని లెక్క వేస్తుంటే, నిమిషానికి లక్ష రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవుతున్నాయట. ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఊహించలేదని, మొదటి నుండి ఈ సినిమాకు హైప్ లేదనే ప్రచారం జరిగిందని, ఆ ప్రచారాన్ని అభిమానులు కూడా నమ్మారని, కానీ ఒక్కసారిగా ప్రీమియర్ షోస్ కి, రెగ్యులర్ షోస్ కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు. అయితే ఆరంభం అదిరింది కానీ, ఇదే రేంజ్ ఊపు పూర్తిగా కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ఆరంభం లో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరాయి, కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. ‘హరి హర వీరమల్లు’ కి కూడా అదే పరిస్థితి వస్తుందా అనే భయం అభిమానుల్లో ఉంది.
Also Read: 3 గంటల్లో 42 వేల టిక్కెట్లు.. తెలంగాణ లో పవన్ ఫ్యాన్స్ విశ్వరూపం!
ఎందుకంటే ఈ చిత్రం పై ఫ్యాన్స్ లో ఉన్నంత ఉత్సాహం, నార్మల్ ఆడియన్స్ లో లేదు. అనేక సార్లు వాయిదా పడడం, సోషల్ మీడియా లో, మెయిన్ మీడియా లో పదే పదే నెగటివ్ ప్రచారం జరగడం వంటివి ఈ సినిమా బజ్ ని బాగా దెబ్బ తీసింది. కానీ హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ థియేటర్స్ బుకింగ్స్ ప్రతీ సినిమాకు కాస్త నెమ్మదిగానే ఉంటాయి. కానీ ‘హరి హర వీరమల్లు’ కి మాత్రం చాలా స్పీడ్ గా బుకింగ్స్ జరుగుతున్నాయి. దీనిని బట్టీ చూస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వస్తుందని, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నైజాం ప్రాంతం లో సూపర్ స్ట్రాంగ్ కాబట్టి, అభిమానులు అసలు భయపడాల్సిన అవసరమే లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.