Kannappa OTT: మంచు విష్ణు(Manchu Vishnu) ప్రతిష్టాత్మకంగా తీసుకొని హీరో గా నటిస్తూ, నిర్మాణ బాధ్యతలను కూడా నెత్తిన వేసుకొని,కోట్ల రూపాయిలు ఖర్చు చేసి, సుమారుగా మూడేళ్ళ నుండి ఎన్నో కష్టనష్టాలను ఎదురుకొని తెరకెక్కించిన చిత్రం ‘కన్నప్ప'(Kannappa Movie). రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ టాక్ కి తగ్గట్టు భారీ వసూళ్ళు మాత్రం రాలేదు. ఓవరాల్ గా ఫుల్ రన్ లో ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి కానీ, అవి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి సరిపోతాయో లేదో మంచు విష్ణు నే చెప్పాలి. అయితే మంచు విష్ణు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని విడుదలకు ముందు అమ్మలేదు అనే విషయాన్ని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
తాను కోరుకున్న రేట్ కి ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పుకోలేదని, అందుకే మేము విడుదలకు ముందు ఓటీటీ రైట్స్ ని అమ్మడానికి ఆసక్తి చూపలేదని, కానీ విడుదల తర్వాత భారీ రేట్ కి అమ్ముతామని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలై కమర్షియల్ గా అద్భుతాలు ఏమి చెయ్యలేదు కానీ, ఒక మంచి సినిమాని చూసాము అనే టాక్ జనాల్లోకి బాగా వెళ్ళింది అనేది మాత్రం వాస్తవం. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ మంచి ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయిందని అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ(Amazon Prime Video) ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకుందట. ఈ నెల 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వబోతుంది అనే ప్రచారం సాగుతుంది కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. చూడాలి మరి ఓటీటీ లో అయినా ఈ సినిమాని ఆడియన్సు ఆదరిస్తారా లేదా అనేది.
Also Read: వైసీపీ నేత రోజా షోలో ‘హరి హర వీరమల్లు’ ప్రొమోషన్స్.. వైరల్ అవుతున్న వీడియో!
ఫ్యామిలీ ఆడియన్స్ మొదటి నుండి భక్తిరస చిత్రాలను ఆదరించడం లో ముందు ఉంటారు. కాబట్టి థియేటర్స్ లో వాళ్ళు కొంతమేరకు ఈ చిత్రాన్ని ఆదరించినా, ఓటీటీ లో మాత్రం భారీ స్థాయిలోనే ఆదరిస్తారని ఆశిస్తున్నారు. మరి అది ఎంత మేరకు నిజం అవుతుందో చూడాలి. ఈ చిత్రం లో మంచు విష్ణు తన ముందు సినిమాలతో పోలిస్తే అద్భుతంగా నటించాడు. అంతే కాదు ఈ చిత్రం లో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి వారు ఉన్నారు. వాళ్ళ పాత్రలు ఎదో బలవంతంగా ఇరికించినట్టు ఉండదు. కథకు తగ్గట్టు చాలా బాగున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుండి ఈ సినిమా వేరే లెవెల్ కి వెళ్తుంది. కచ్చితంగా ఆడియన్స్ చూడాల్సిన సినిమానే, అమెజాన్ ప్రైమ్ వీడియో లో వచ్చినప్పుడు మిస్ అవ్వకండి.