Daku Maharaj : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న బాలయ్య, ఈ సినిమాతో తన జైత్ర యాత్రని ముందుకు కొనసాగిస్తున్నాడు. ఒకప్పుడు కూడా బాలయ్య ఈ రేంజ్ ఫామ్ లో ఉండేవాడు కాదు. రెండేళ్లకు, లేదు మూడేళ్లకు ఒక హిట్ తో సరిపెట్టేవాడు.
గడిచిన రెండు దశాబ్దాలలో అఖండ కి ముందు ఆయన తీసిన సినిమాలలో కేవలం సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహా, లెజెండ్ వంటి చిత్రాలు మాత్రమే హిట్ అయ్యాయి. కానీ ఇప్పుడు కేవలం నాలుగేళ్లలోనే నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లను అందుకొని తన సత్తా చాటాడు. మూడు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి నిన్న అనేక ప్రాంతాల్లో మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబడుతున్నప్పటికీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం అనుకున్న స్థాయి వసూళ్లను రాబట్టలేకపోతుంది. ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ సినిమా ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తుంది. అక్కడ ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి. ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి 1 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆ తర్వాత రోజు నుండి మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు ట్రేడ్ పండితులు.
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి 5 రోజులకు గాను 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఇది బాలయ్య మార్కెట్ కి చాలా పెద్దది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా రావాలి, ఆ మార్కుని ఈ చిత్రం రేపు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం మంచి షేర్స్ వచ్చే సూచనలు ఉన్నందున, ఫుల్ రన్ లో కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నెగటివ్ టాక్ బాగా రావడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.