Game changer : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి తమిళ్ సినిమా దర్శకుడు అయిన శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేశాడు. ఇక శంకర్ లాంటి డైరెక్టర్ తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరోకు ఉంటుంది. అయినప్పటికి సినిమా చేసే అవకాశం మాత్రం కొందరికే వస్తుంది. అందులో రామ్ చరణ్ చాలావరకు లక్కీ పర్సన్ అనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో మెగా అభిమానుల్లో కొంతవరకు నిరాశను మిగిల్చిందనే చెప్పాలి…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ లాంటి దర్శకుడు మరొకరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఆయన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట చేస్తున్న సినిమాలతో ఆయన మరొక రేంజ్ లోకి వెళ్లాలని అనుకున్నాడు. కానీ గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదనే చెప్పాలి. ఇక ఈ విషయం మీద రీసెంట్ గా శంకర్ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా విషయంలో ఆయన పూర్తిగా అసంతృప్తి తో ఉన్నానని తెలియజేశాడు. కారణం ఏంటి అంటే ఈ సినిమా మొదట ఐదు గంటల నడివితో తెరకెక్కిందట. అందువల్లే ఈ సినిమాని కట్ చేయాల్సి వచ్చిన నేపథ్యంలో చాలా మంచి సీన్లు సినిమాలో నుంచి వెళ్లిపోయాయని తద్వారా సినిమాకి అనుకున్నంత టాక్ అయితే రాలేదని ఆయన తెలియజేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను శంకర్ ఇంకాస్త జాగ్రత్త తీసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తే రామ్ చరణ్ మరోసారి పాన్ ఇండియా లేవల్లో స్టార్ హీరో గా వెలుగొందుతాడు అని అందరు అనుకున్నారు.
కానీ ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించడం లేదనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకి 300 కోట్ల వరకు కలెక్షన్లు అయితే వచ్చాయి. మరి ఎట్టకేలకు ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… రామ్ చరణ్ కూడా ఈ సినిమా విషయంలో కొంతవరకు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
దానికోసమే నెక్స్ట్ బుచ్చిబాబుతో చేయబోతున్న సినిమా విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో అటు డైరెక్టర్, ఇటు హీరో ఇద్దరూ కూడా కొంతవరకు నిరాశను వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…