ఇప్పటివరకు స్వాతంత్ర భారతావనిలో దేశం ఎదుర్కొన్న అతిపెద్ద సామాజిక సమస్య మతం మాటున జరుగుతున్న ఆవేశకావేశాలు , వివాదాలు, వుద్రిక్తలు, ఘర్షణలు. అవి ఎలా జరుగుతున్నాయో వివరణాత్మకంగా చర్చించుకున్నాము. చివరగా సమస్య ఎలా అయితే పరిష్కరించబడుతుందో సూచించటం మా బాధ్యతగా భావిస్తున్నాము. ముందుగా తెలుసుకోవాల్సింది ఇందుకు ఏ ఒక్కరూ బాధ్యులు కారని. చారిత్రకవారసత్వంతో ముడిపడివున్న సమస్యకు నిప్పురాజేసి ఉండొచ్చేమో గానీ సమస్యమాత్రం చాలా పురాతనమయినది. అందుకే పరిష్కారం కూడా అంత తేలిక కాదు. కనీసం ఇంతవరకు సమస్యకు నిజాయితీగా పరిష్కారమార్గాలు మాత్రం వెదకలేదు, ముఖ్యంగా మనన్ని పరిపాలించిన రాజకీయ నాయకత్వం. ఇది సత్యం. అందుకే దీనికి పరిష్కారమార్గాలు కూడా రాజకీయేతర మార్గాల ద్వారా వెదకాల్సిన అవసరం వుంది. ముందుగా ఇప్పటివరకు చర్చించుకున్న విషయాల్ని ఒకచోటకు చేర్చి సమీక్షించుకొని తర్వాత దానికి పరిష్కార మార్గాలు వెదుకుదాం.
వివాదాస్పద అంశాలు
ఇవీ స్థూలంగా కొన్ని వివాదాస్పద అంశాలు. చర్చల్లో ఇంకేమయినా వస్తే వాటిని పరిశీలించి స్వీకరించవచ్చు. వీటన్నింటికీ పరిష్కారమార్గాలు కనుగొన్నప్పుడే మత సామరస్యం శాశ్వతంగా వెల్లివిరుస్తుంది. లేకపోతే ఈ ఘర్షణలు, ఉద్రిక్తతలు రావణాకాష్టం లాగా కాలుతూనే వుంటాయి. దీనిపై విస్తృత చర్చ జరగాలి. ఇందుకోసం ఎవరిని విశ్వాసంలోకి పరిగణలోకి తీసుకోవాలి, ఎలా ముందు కెళ్ళాలో వచ్చే భాగం లో చర్చించుకుందాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Communal harmony controversial issues part 10
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com