https://oktelugu.com/

AP Rains: ఏపీకి చల్లటి కబురు.. ఆ రెండు ప్రాంతాల్లో వర్షాలు!

AP Rains మరోవైపు దక్షిణ చత్తీస్గడ్( South Chhattisgarh) నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ చత్తీస్గడ్ నుంచి మహారాష్ట్ర మధ్య మరో ద్రోణి విస్తరించి ఉంది.

Written By: , Updated On : April 1, 2025 / 12:11 PM IST
AP Rain Alert

AP Rain Alert

Follow us on

AP Rains: ఏపీ( Andhra Pradesh) ప్రజలకు చల్లటి కబురు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పిడుగుల పాటు అధికంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ హెచ్చరిస్తోంది. వేసవి కావడంతో పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశువుల పెంపకందారులు, గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండకూడదని సూచించింది విపత్తుల నిర్వహణ సంస్థ. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వర్షం పడుతుందని చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ.

Also Read: వైసీపీతో టచ్ లో వర్మ.. ముద్రగడ కుమార్తె షాకింగ్ కామెంట్స్!

* కొనసాగనున్న వడగాలులు
అయితే ఈరోజు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత( summer effect) అధికంగా ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాలో ఆరు, విజయనగరం జిల్లాలో ఆరు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం నంద్యాల గోస్పాడు లో 40.2, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు.

* ఉపరితల ఆవర్తనం
మరోవైపు దక్షిణ చత్తీస్గడ్( South Chhattisgarh) నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ చత్తీస్గడ్ నుంచి మహారాష్ట్ర మధ్య మరో ద్రోణి విస్తరించి ఉంది. అదే సమయంలో ఉపరితల ఆవర్తనం సైతం తమిళనాడు వరకు విస్తరించి ఉంది. మంగళవారం తేలికపాటి నుంచి సాధారణ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం కూడా తేలికపాటి జల్లులు కొనసాగుతాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు పడే పరిస్థితి ఉంది.

* తెలంగాణలో వడగళ్ల వాన తెలంగాణలో( Telangana) కూడా మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనంతోనే వర్షాలు పడతాయని చెప్తోంది. చిరుజల్లులతో పగటి ఉష్ణోగ్రతలు తక్కువ ముఖం పట్టే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా ఎండల తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వర్షాలు పడనుండడంతో సేదతీరనున్నారు.