HomeNewsChittam Maharani: ఆకర్షణగా 'చిత్తం మహారాణి' టైటిల్ పోస్టర్​.. సుకుమార్ చేతులమీదుగా విడుదల!

Chittam Maharani: ఆకర్షణగా ‘చిత్తం మహారాణి’ టైటిల్ పోస్టర్​.. సుకుమార్ చేతులమీదుగా విడుదల!

Chittam Maharani: యజుర్వేద్​, రచన, సునీల్​ కీలక పాతల్లో ఏ.కాశీ తెరకెక్కిస్తోన్న సినిమా చిత్ర మహారాణి. జెఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్​ పోస్టర్​ విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు.

chittam maharani

సురేశ్​ సిద్హాని మాటలు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్​డేట్స్​ను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఫస్ట్​లుక్​ చూడగానే విభిన్న కథతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు, అల్లు అర్జున్​ హీరోగా నటిస్తోన్నపుష్పను తెరకెక్కించడంలో సుకుమార్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. ప్యాచ్​ వర్క్​లను కంప్లీట్​చేసుకుని.. డిసెంబరులో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

కాగా, ఇందులో అల్లు అర్జున్ తన కెరీర్​లో ఎప్పుడూ కనిపించనంత ఊర మాస్​ లుక్​లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్​, సాంగ్​లు సినిమాపై వేరే లెవెల్ అంచానలు నెలకొల్పాయి. కాగా, నవంబరు 18న నాలుగో సాంగ్​ను విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ఇందులో హీరోయిన్​గా రష్మిక నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను రెండుభాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular