
కోహ్లీ సేన పై మరోసారి ధోనీ సేన పైచేయి సాధించింది. దుబాయి వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 6 వికెట్ల తేడాతో కోహ్లీ సేనను ఓడించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ సేన ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించింది. విరాట్ కోహ్లీ (53), పకిక్కల్ (70) అర్ధ శతకాలతో మెరిశారు.
జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. కానీ పరుగు తీయడంలో మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. మెరుపులు పెరిపిస్తాడని అను డివిలియర్స్ మ్యాక్స్ వెల్ తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. పడిక్కల్ తో పాటు విధ్వంసక బ్యాట్స్ మన్ డివియర్స్ (12) ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చిన శార్దూల్ ఠాకూర్ బెంగుళూరును గట్టి దెబ్బకొట్టాడు. మ్యాక్స్ వేల్ క్రీజులో ఉన్న వేగంగా ఆడలేకపోయాడు. తొలి 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసి బెంగుళూరు జట్టు చిరవి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 66 పరుగులే చేయగలిగింది.
టార్గెట్ లో చెన్నై దూకుడుగా ఆడింది. ముంబాయితో పోరులో మ్యాచ్ ను గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్ అదే జోరు ప్రదర్శించాడు. స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరోవైపు డుప్లెసిస్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయడంతో చెన్నై ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. ఈ ఇద్దరు ఔటైన రాయుడు, మొయిన్ అలీ, రైనా ఎదురుడాడి చేయడంతో చెన్నై గెలుపు బాట పట్టింది.