Google Maps scams: కొంతమంది ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలంటే దగ్గరి వారిని అడిగి తెలుసుకునే వాళ్ళు. కానీ నేటి కాలంలో మనుషుల మధ్య సంబంధాలు దూరమవుతున్నాయి. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోతుంది. ఈ క్రమంలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఇతరులను అడిగే కంటే ఫోన్లోని గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లడం బెటర్ అని చాలామంది భావిస్తున్నారు. అయితే గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని చాలామంది తీవ్రంగా నష్టపోయారు. కొందరు గూగుల్ మ్యాప్ ని నమ్ముకొని ప్రయాణించడం వల్ల దారితప్పి అడవిలోకి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని ప్రయాణించిన ముగ్గురు వ్యక్తులు సగం వంతెన నుంచి పడి చనిపోయిన సంఘటన విషాదాన్ని నింపింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త యాప్ అందరినీ ఆకర్షిస్తుంది. ఇది భారత్ కు చెందినది కావడంతో దేశంలోని ప్రతి గల్లీ మ్యాపును కరెక్ట్ గా చూపిస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్లండి..
మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని పనులు ఈజీగా చేసుకోగలుగుతున్నారు. ఇందులో భాగంగా దూర ప్రయాణాలు చేసేవారు.. ముఖ్యంగా కారులో వెళ్లేవారు గూగుల్ మ్యాప్ ఆధారంగా తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు.. కానీ గూగుల్ మ్యాప్ అన్ని దారులను కరెక్టుగా చూపించడం లేదు. దీంతో కొందరి ప్రయాణికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో మార్కెట్లోకి ‘నావిగేషన్ యాప్’ అందుబాటులోకి వచ్చింది. ‘Maples mapmy India’ పేరుతో ఉన్నాయి ఈ యాప్ లో భారత దేశంలోని అన్ని దేశాలను కరెక్ట్ గా చూపిస్తుందని అంటున్నారు.
Maples mapmy India’ దేశంలోని ప్రతి గల్లీ గురించి అవగాహన ఉంది హైవేలు మాత్రమే కాకుండా స్థానిక రోడ్లో వీధుల గురించి ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది వినియోగదారుల ప్రయాణ గమ్యాన్ని ఆధారంగా చేసుకుని ఇది అప్డేట్ చేస్తుంది ఎక్కడైనా కొత్తగా రహదాలను నిర్మిస్తున్నారా లేదా రోడ్డు రిపేరులో ఉందా అనే విషయాన్ని ఇది తెలుపుతుంది.
అంతేకాకుండా ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యేలా స్థానిక భాషతో కనిపిస్తూ ఉంటుంది. దీంతో సులభంగా తమ గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఇక మరో విశేషమేమిటంటే ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్లోనూ ఈ యాప్ పనిచేస్తుంది. దీంతో ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా ప్రయాణం ఈజీగా చేయవచ్చు. కాగా ఈ యాప్ ఇండియన్ స్పేస్ రీఛార్జ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం ద్వారా పనిచేస్తుంది.
ఇకనుంచి ఎప్పుడైనా ప్రయాణం చేయాలని అనుకునే సమయంలో గూగుల్ మ్యాప్ కు బదులు ఈ నావిగేషన్ యాప్ ను ఉపయోగించి పరీక్షించుకోండి. కచ్చితంగా గూగుల్ మ్యాప్ కంటే ఇది బెటర్ రూట్ ను చూపిస్తుందని కొందరు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లాలని అనుకునే వారికి స్థానికంగా మనసులు ఎవరు కనిపించరు. కానీ గూగుల్ మ్యాప్ ఒక్కోసారి మోసం చేస్తుంది. అందువల్ల ఈ నావిగేషన్ యాప్ సహాయంతో ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.