https://oktelugu.com/

Manchu Family: మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం, తమ్ముడి ఇంటికి వెళుతున్న అన్న!

మంచు బ్రదర్స్ మధ్య వివాదం అంతకంతకు ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దుబాయ్ నుండి వచ్చిన విష్ణు.. నేడు మనోజ్ ఇంటికి వెళ్లనున్నాడట. మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలాగా ఉన్నారట. మనోజ్ ఇంటి సీసీ కెమెరాలు, హార్ట్ డిస్క్ లు విష్ణు ఫ్రెండ్ ఎత్తుకుపోయాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : December 9, 2024 / 12:02 PM IST

    Manchu Family

    Follow us on

    Manchu Family: ఆస్తుల పంపకాలతో మంచు కుటుంబంలో కుంపటి రాజేసుకుంది. మోహన్ బాబు తన ఆస్తిలో కొంత మేర ముగ్గురు పిల్లల పేరిట రాశారు. లక్ష్మి, మనోజ్ లకు అన్యాయం చేసిన మోహన్ బాబు.. విష్ణుకు ఎక్కువ ఆస్తి ఇచ్చాడనే వాదన పరిశ్రమలో ఉంది. మంచు కుటుంబానికి తిరుపతిలో గల శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలు మేజర్ ఇన్కమ్ సోర్స్. ఈ ఆస్తిలో వాటాలు పంచలేదు. అలాగే దీనిపై ఆధిపత్యం మంచు విష్ణుకు ఇచ్చాడు మోహన్ బాబు. స్కూల్, కాలేజ్, ఇతర విద్యా సంస్థలను, ఆయనే చూసుకుంటారు.

    ఈ క్రమంలో మనోజ్ కి అసహనం ఏర్పడింది. అదే సమయంలో విష్ణుతో సినిమాలు నిర్మిస్తున్న మోహన్ బాబు.. మనోజ్ కి అవకాశం ఇవ్వడం లేదు. శ్రీ విద్యానికేతన్ లో తన వాటా ఆస్తి మనోజ్ అడుగుతున్నారట. ఈ క్రమంలో మోహన్ బాబు కొడుకును సెటిల్మెంట్ కి పిలిచాడట. అప్పుడే మనోజ్ పై దాడి జరిగిందట. ఫహాడా షరీఫ్ పోలీస్టేషన్ లో మోహన్ బాబు, మనోజ్ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన మనోజ్ ని మీడియా చుట్టుముట్టింది. ఆయన ఏం మాట్లాడలేదు. ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు.

    కాగా దుబాయ్ నుండి మంచు విష్ణు వచ్చారట. విష్ణు బిజినెస్ పార్ట్నర్ జల్పల్లి లో గల మనోజ్ ఇంటికి వెళ్ళాడట. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నాడట. మనోజ్ ఇంటికి విష్ణు ప్రైవేటు వ్యక్తులను, బౌన్సర్లను కాపలా పెట్టాడట. మనోజ్ ని విష్ణు నేడు కలుస్తాడనే టాక్ వినిపిస్తుంది. నిన్న మొదలైన హైడ్రామా కొనసాగుతుంది. నెక్స్ట్ ఏమి జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఒక కుటుంబంలోని వ్యక్తులు కొట్టుకునే వరకు వెళ్లడం చర్చకు దారి తీసింది.

    మనోజ్ గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి సంతానం. మౌనికతో పెళ్లిని కూడా మోహన్ బాబు,విష్ణు వ్యతిరేకించారనే వాదన ఉంది. ఆస్తుల పంపకాల్లో మోహన్ బాబు.. మంచు లక్ష్మి, మనోజ్ లకు అన్యాయం చేశాడట. విష్ణుకు అధిక భాగం కట్టబెట్టాడట. అందుకే మంచు లక్ష్మి, మనోజ్ ఒక్కటయ్యారని, వారిని ద్వేషిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి.