Chandrababu : ఏపీలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుతోంది. నేతల విమర్శలు హద్దులు దాటుతున్నాయి. మొన్నటిదాకా హుందాగా వ్యవహరిస్తారనే పేరున్న నాయకులు కూడా నోటికి తాళం వేయడం లేదు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రతిపక్షం, అధికార పక్షం అనే తేడా లేదు. కాకపోతే ఇలా చేస్తున్న విమర్శలలో ఒక్కోసారి నోరు జారి అభాసుపాలవుతున్నారు. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన ఈ కాలంలో అలాంటి వీడియోలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. అంతేకాదు వైరి పక్షానికి అనుకోని ఆయుధం లాగా మారుతున్నాయి. ఇలాంటి వీడియోల వల్ల ఏం జరుగుతుంది? అనే ప్రశ్న తలెత్తవచ్చు. పెద్ద ఓడను సైతం ముంచేది చిన్న చిల్లే అనే మాటను మరువకూడదు. ఇలాంటి చవకబారు విమర్శలు చేసింది ఎవరో గల్లి స్థాయి నాయకుడో, ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నేతో అనుకుంటే పొరపాటే.. ఈ మాటలు అన్నది 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.
చంద్రబాబు ఇటీవల ఒక ఎన్నికల సభలో మాట్లాడారు. వైసిపి పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు పరిపాలన చేతకాదని దుయ్యబట్టారు. ఏపీ రాష్ట్రాన్ని నాశనం చేశారని.. భవిష్యత్ తరాలకు అవకాశాలు లేకుండా భ్రష్టు పట్టించారని విమర్శించారు. సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు విమర్శలు చేయడానికి కచ్చితంగా ఆయనకు అధికారం ఉంటుంది. కానీ ఇక్కడే ఆయన అదుపుతప్పారు. “మీ భవిష్యత్తు నాశనం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని” ఆవేశంతో అన్నారు. దీంతో ఆ సభకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఇంకేముంది దొరికింది రా ఆయుధం అనుకుంటూ ఈ వీడియోను వైసిపి అనుకూల సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు. దెబ్బకు అది సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.
అయితే చంద్రబాబు అలా మాట్లాడారని, 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన ఆచితూచి వ్యాఖ్యలు చేస్తుంటారని టిడిపి నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయం కాబట్టి.. అధికార వైసిపి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని వారు చెబుతున్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారని, కానీ దానిని వక్రీకరించి.. విష ప్రచారానికి దిగుతున్నారని వైసీపీ నేతలపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Chandrababu is trolling on false dialogue campaign
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com