Call Drop: ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫోన్‌ను ఎక్కువగా కాల్స్ చేయడానికి, ఇంటర్నెట్ ఉపయోగించడానికి లేదా సినిమాలు చూడటానికి ఉపయోగిస్తారు. కానీ పదే పదే కాల్స్ కట్ అయితే అది వినియోగదారులకు అసౌకర్యంగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు ముఖ్యమైన మాటలు కూడా ఆగిపోతాయి. మీరు కూడా కాల్ డ్రాప్ సమస్యతో బాధపడుతుంటే కొన్ని చిట్కాలను ఈ వార్తలో తెలుసుకుందాం. వాటిని ఉపయోగించడం ద్వారా కొంత వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
కాల్ డ్రాప్ కావడానికి కారణాలు
* నెట్‌వర్క్ సిగ్నల్: కాల్ డ్రాప్‌కు అత్యంత సాధారణ కారణం వీక్ నెట్‌వర్క్ సిగ్నల్. మీ ప్రాంతంలో టెలికాం టవర్ దూరం ఎక్కువగా ఉంటే దాని వల్ల కూడా సిగ్నల్ బలహీనంగా ఉంటుంది.
* నెట్‌వర్క్ రద్దీ: రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకే సమయంలో చాలా మంది నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తారు. దీని వల్ల నెట్‌వర్క్‌పై ఒత్తిడి పెరుగుతుంది. కాల్ డ్రాప్ అయ్యే అవకాశం పెరుగుతుంది.
* సాఫ్ట్‌వేర్: కొన్నిసార్లు ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో బగ్స్ లేదా పాత వెర్షన్ కారణంగా కూడా కాల్ డ్రాప్ సమస్య రావచ్చు.
* వై-ఫై కాలింగ్ సెట్టింగ్: కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలో వై-ఫై కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది వీక్ నెట్‌వర్క్‌లో కాల్‌ను వై-ఫై ద్వారా రూట్ చేస్తుంది. వై-ఫై కనెక్షన్ వేగం తక్కువగా ఉంటే కాల్ డ్రాప్ కావచ్చు.
నిమిషాల్లో కాల్ డ్రాప్ పరిష్కారం
* ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి: కొన్నిసార్లు ఫోన్‌ను రీ స్టార్ట్ చేయడం ద్వారా నెట్‌వర్క్ కనెక్షన్ రీసెట్ అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
* నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి: ఫోన్ సెట్టింగ్‌లలోకి వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి. దీని వలన పాత నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్‌లు తొలగించబడతాయి. కొత్త కనెక్షన్ యాడ్ అవుతుంది.
* వై-ఫై కాలింగ్‌ను ఆఫ్ చేయండి: మీరు వై-ఫై కాలింగ్‌ను ఉపయోగిస్తుంటే, కాల్ డ్రాప్ అవుతుంటే దాన్ని ఆఫ్ చేసి చూడండి.
* సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి: ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి. కంపెనీలు ఎప్పటికప్పుడు బగ్ ఫిక్స్‌లు, మెరుగుదలల కోసం అప్‌డేట్‌లను విడుదల చేస్తాయి.
* నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను మార్చడం: మీ ప్రాంతంలో మరొక టెలికాం కంపెనీ నెట్‌వర్క్ బాగా ఉంటే దానిపైకి మారడం గురించి ఆలోచించండి.