
తిరుమలలోని తిరువెంకటపధం 2 రోడ్డులో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడకు చేరుకుని జేసీబీ సహాయంతో కొండ చరియలను తొలగిస్తున్నారు. కరోనా ఆంక్షలు నేపథ్యంలో గత తొమ్మిది నెలలుగా ఈ రహదారిలో వాహన రాకపోకలను టీటీడీ నిషేధించింది. దీంతో కొండచరియలు విరిగిపడిన సమయంలో భక్త సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.