
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను లాక్కుంటోందని దుయ్యబట్టారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ట్విటర్ వేదికగా గురువారం ఆయన మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.”మోదీ ప్రభుత్వం పేదల ప్రాథమిక హక్కులను లాక్కుంటోంది. ఇది మానవత్వానికి వ్యతిరేక నేరం. ఈ దేశ ఉత్తమ భవిష్యత్తు కోసం మనం అన్ని వర్గాలను గౌరవించాలి” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.