Bigg Boss 7 Telugu : భోలే పై థూ అని ఊసిన ప్రియాంక… పాట బిడ్డ మైండ్ బ్లోయింగ్ రిప్లై!

ఈ నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు . ఈ రోజు ప్రోమోలో శోభా తేజ ని నామినేట్ చేసింది. నువ్వు పనిషమెంట్ సీరియస్ తీసుకోవడం లేదు అని శోభా చెప్పింది.

Written By: NARESH, Updated On : October 17, 2023 9:46 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఏడో వారం నామినేషన్ ప్రక్రియ బాగా ఫైర్ మీద జరుగుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ మొత్తం భోలే మీద పడ్డారు. అందరూ అతడిని టార్గెట్ చేసి నామినేట్ చేశారు.భోలే మాత్రం చాలా సరదాగా తీసుకుని పంచులు వేస్తూ ఎంటర్టైన్ చేసాడు.ఈ ప్రాసెస్ లో ప్రియాంక ,భోలే మధ్య గట్టిగా వాదన జరిగింది. నీ రీజన్ విని నాకు నవ్వొస్తుంది అని భోలే అనగానే, నేను నీకు జోక్ గా కనిపిస్తున్నానా ..ఇది జోకా అంటూ ఫైర్ అయింది.ఇక పాటలు పాడుతూ రా నామినేట్ చెయ్యి అని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు భోలే.

ఈ నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు . ఈ రోజు ప్రోమోలో శోభా తేజ ని నామినేట్ చేసింది. నువ్వు పనిషమెంట్ సీరియస్ తీసుకోవడం లేదు అని శోభా చెప్పింది. నేను ఫన్ కోసం చేశా బ్రో అని తేజ అన్నాడు. నీకు ప్రతిదీ ఫన్నీ కాదు, మాకు సీరియస్ గా కనిపిస్తుంది. అని చెప్తూ ఓవర్ యాక్షన్ చేసింది.ఆ తర్వాత భోలే ని నామినేట్ చేసింది. నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుంది.

ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ మాట అనగానే ప్రియాంక కలగజేసుకుని రెచ్చిపోయింది. ఆడ పిల్ల .. ఆడ పిల్ల అంటూ నటిస్తున్నావ్ కదా కనిపిస్తుంది అంటూ ఫైర్ అయింది. ‘నీ లాంటోళ్లని చాలా మందిని చూశా పో ‘అని భోలే ఇచ్చిపడేసాడు. దానితో ప్రియాంక ‘ఏంటి నాలాంటోళ్లని చూసేది ‘ ఈ మాటలు నేను భరించలేక పోతున్న బిగ్ బాస్ అని భోలే పై ‘నువ్వు నటించావ్..అంటూ అరిచింది.

ఇక శోభా అందుకొని ఆడపిల్ల అని ఇప్పుడు గుర్తొచ్చినట్టు ఉంది.ఆడపిల్ల పక్కన ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అని రంకెలు వేసింది. ప్రియాంక ఐతే తు అని ఊసింది. దానికి భోలే ‘నువ్వు నన్ను తు అన్నావ్ అదే తు అని నేను ఊస్తే నీ బతుకు ఏం కావాలి ‘ అని దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే, శోభా తనని నామినేట్ చేసినందుకు తేజా చాలా బాధ పడ్డాడు. హౌస్ లో ఉన్న 12 మంది నన్ను నామినేట్ చేసిన ఇంత బాధ పడే వాడిని కాదు అని శోభతో అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.