Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ కెప్టెన్సీ లో భాగం గా ఇచ్చిన బిగ్ బాస్ బీబీ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో మొదలయిన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. హౌస్ మేట్స్ ని మొత్తం నాలుగు టీం లగా విభజించిన బిగ్ బాస్ సిరి, కాజల్ ని ఫ్యాక్టరీ యొక్కమేనేజర్ల గా నియమించాడు. రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ గురువారానికి (మూడో రోజుకి ) ఒక కొలిక్కి రానున్నది.

టాస్క్ లో భాగంగా ఏ టీం అయితే ఎక్కువ బొమ్మలని తాయారు చేస్తారో వాళ్ళు టాస్క్ లో విజయం సాధిస్తారు. అంతే కాకుండా ఫ్యాక్టరీ మేనేజర్లు అయిన సిరి, కాజల్ లో ఒకరు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంచుకోబడతారు. అయితే తాజాగా గురువారం విడుదల చేసిన ప్రోమోలో భాగంగా తయారు చేసిన బొమ్మల లెక్కని ఫ్యాక్టరీ మేనేజర్లగా వ్యవహరించబడుతున్న సిరి, కాజల్ ని అడుగుతాడు బిగ్ బాస్. ఈ నేపథ్యం లో కాజల్ కి, శ్వేతా కి మధ్య ఒక వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు చూపిస్తాడు బిగ్ బాస్. సిరి మాట్లాడుతూ.. టాస్క్ జరుగుతున్నప్పుడు బొమ్మలని లాగారు, చింపారు, అందుకే రీ చెకింగ్ చెయ్యాలి అని అంటుంది. జట్లకు సంబందించిన బొమ్మలని కౌంట్ లో తీసేసి పక్కన పడేస్తారు కాజల్, సిరి.
ఈ సమయం లో బిగ్ బాస్ ఒకసారిగా పెద్ద బాంబే పిలుస్తాడు. టాస్క్ జరుగుతున్న సమయం లో కొంత మంది సభ్యులు బిగ్ బాస్ హౌస్ యొక్క అతి ముఖ్యమైన రూల్ ని ఉల్లఘించారు. అంతే కాకుండా కెప్టెన్సీ పోటీదారులు కాకుండా సిరి, కాజల్ మీద అనర్హత వేటు వేసాడు బిగ్ బాస్. మరి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఉల్లఘించారో తెల్సుకోవాలంటే ఇవ్వల్టి ఎపిసోడ్ చూడాల్సిందే.