Allu Arjun and Boyapati: యాక్షన్ చిత్రాల దర్శక దిగ్గజం బోయపాటి శ్రీనుతో అల్లు అరవింద్ ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించాడు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు అంటూ చర్చ మొదలైంది. బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నాడు.

ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. తాజాగా తన బేనర్ లో బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా చేయబోతున్నాడని ఆహా కోసం బాలయ్య చేస్తోన్న షో తాలూకు స్టేజ్ మీద అరవింద్ బాలయ్యతో చెప్పాడు. ఇప్పటికే బన్నీ కోసం ఓ స్క్రిప్టును కూడా బోయపాటి సిద్ధం చేశాడు. ఈ సినిమా ఓ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండనుంది.
ముఖ్యంగా బన్నీకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. అంటే పాన్ ఇండియా సినిమా అన్నమాట. పుష్ప పూర్తి అయిన వెంటనే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరో వెంకటేష్ కూడా నటిస్తాడని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.
మరి వెంకీ – బన్నీ కలయిక పై క్లారటీ వచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించిన రూమర్స్ పుంఖానపుంఖాలుగా వస్తూనే ఉంటాయి, ఏది ఏమైనా బాలయ్యతో చేస్తోన్న అఖండ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండానే బోయపాటి తన తర్వాత సినిమాని కూడా భారీ స్థాయిలో సెట్ చేసుకోవడం గొప్ప విషయమే. నిజానికి బోయపాటి అడిగినా ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వడానికి రెడీగా లేడు అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.
Also Read: Balakrishna: బాలయ్య గొప్పతనానికి ఇదే నిదర్శనం !
కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పాడు అరవింద్. పైగా బోయపాటి తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ అంటూ అల్లు అరవింద్ గొప్పగా చెప్పడం విశేషం. ఏది ఏమైనా హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటి మేటి. ఇక బాలయ్యతో చేస్తున్న “అఖండ” సినిమా ఎలాగూ హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు బోయపాటి.
Also Read: Prabhas: డబుల్ యాక్షన్ లో ప్రభాస్ క్రేజీ యాక్షన్ ?