Tamanna: మిల్క్ బ్యూటీ తమన్నా డబ్బు పిచ్చి మరీ దారుణంగా తయారయింది. అసలు ఏ అవకాశం వచ్చినా తమన్నా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎలాగూ కెరీర్ ఎండింగ్ కి వచ్చింది కాబట్టి.. తాజాగా మరో సినిమా ఒప్పుకుంది. అయితే, ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ కాదు, విలన్. ఓ లేడీ విలన్ పాత్రలో ఆమె కనిపించబోతుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలోనే తమన్నా విలన్ గా నటించబోతుంది.

ఈ సినిమా రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రను డిజైన్ చేశాడట. ఈ పాత్రకు తమన్నా అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకుడు ఆమెను అప్రోచ్ అవ్వడం, తమన్నా ఎలాంటి షరతులు పెట్టకుండా క్యారెక్టర్ చేయడానికి అంగీకరించడంతో మొత్తానికి తమన్నా లిస్ట్ లో మరో వైవిధ్యమైన పాత్ర పడబోతోంది.
అయితే, ఈ విషయాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంది. రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ కూడా చాలా విభిన్నంగా ఉంటుందట. ఏది ఏమైనా తమన్నా మాత్రం తన దగ్గరకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని మిస్ చేసుకోవడం లేదు.
కెరీర్ చివరి దశలో ఉంది. ఈ లోపు మళ్ళీ తన హవా చూపించి సాధ్యమైనంత వరకు సంపాదించుకోవాలి అని ఆరాట పడుతుంది మిల్క్ బ్యూటీ. ఈ క్రమంలోనే ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తోంది. అలాగే చిన్నాచితకా సినిమాలను కూడా చేస్తోంది. . “గుర్తుందా శీతాకాలం” అనే సినిమాలో సత్యదేవ్ లాంటి చిన్న హీరో సరసన కూడా నటించింది.
మొత్తానికి ఖాళీగా లేకుండా ఎప్పటికప్పుడు బిజీ బిజీగా దూసుకుపోతుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో “ఎఫ్ 3″ ఉంది. వెంకటేష్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తానికి సీనియర్ హీరోలతో పాటు క్రేజ్ లేని కుర్ర హీరోలతో కూడా నటిస్తూ.. కేవలం భారీ రెమ్యునరేషనే తన పాలసీగా పెట్టుకుని తమన్నా ముందుకు పోతుంది.
చిన్న హీరోలు అయితే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయనేది తమన్నా ఫీలింగ్. ఈ క్రమంలో తమన్నా ఎవరిని వదిలిపెట్టకుండా సినిమాలు చేస్తోంది.