Homeలైఫ్ స్టైల్House Cleaning Astrology: ఇల్లు ఊడ్చే మహిళలకు ఇది తప్పనిసరి..

House Cleaning Astrology: ఇల్లు ఊడ్చే మహిళలకు ఇది తప్పనిసరి..

House Cleaning Astrology: చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు. తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటారు. ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయినా కూడా తమ ఇంట్లో ఎప్పుడూ వివాదాలు ఉంటున్నాయని.. ఇంట్లో డబ్బు నిలువ ఉండడం లేదని బాధపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య మనశ్శాంతి లేకుండా ఎప్పటికీ గొడవలు అవుతూ ఉంటాయని ఆవేద చెందుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఉండడానికి కొన్ని పనులు కూడా కారణంగా ఉండే అవకాశం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇంట్లో మహిళలు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఇంట్లో డబ్బు నిల్వకుండా ఉంటుందని.. అలాగే వీరు చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో గొడవలు ఉంటాయని అంటున్నారు. అసలు మహిళలు ఎలాంటి పొరపాట్లు చేస్తుంటారు? ఏం చేస్తే ఇంట్లో డబ్బు నిలువ ఉంటుంది?

ఒకప్పుడు మహిళలు ఆచార వ్యవహారాలను పకడ్బందీగా పాటించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు చేసే కార్యక్రమాల వల్ల ఇల్లు ఎప్పుడు సంతోషంగా గడిచేది. అలాగే ఇంట్లో కావలసినంత డబ్బు ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడం వల్ల తీరిక ఉండడం లేదు. అంతేకాకుండా కొందరు గృహిణులు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుండడంతో కొన్ని పద్ధతులను పాటించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అయితే ఈ నిర్లక్ష్యం వల్ల ఇంటి మొత్తానికి దోషం ఏర్పడుతుందని కొందరు పండితులు చెబుతున్నారు.

ఉదాహరణకు ఇల్లు తుడిచే క్రమంలో చాలామంది మహిళలు పొరపాటు చేస్తుంటారు. ఉదయం పిల్లలు, భర్త తమ విధుల్లోకి వెళ్లిన తర్వాత ఇంటిని తుడుస్తూ ఉంటారు. కానీ అలా చేయడం పొరపాటు. ఇంట్లోని వారు బయటకు వెళ్లిన తర్వాత ఎప్పుడు కూడా ఇల్లును తుడవకుండా ఉండాలి. ఉదయం లేవగానే ముందుగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత సాయంత్రం సమయంలో ఇంటిని తుడుచుకోవాలి. అంతేగాని మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని కొందరు పండితులు చెబుతున్నారు. అలాగే రాత్రి సమయంలో కూడా ఇల్లును శుభ్రం చేయకుండా ఉండాలి.

ఇంట్లో గొడవలు లేదా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నవారు ఇల్లు తుడిచే సమయంలో ఆ నీటిలో కాస్త ఉప్పు వేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో నేలపై ఏవైనా క్రిములు ఉన్నా కూడా ఈ నీటితో తొలగిపోతాయి. దీంతో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. అలాగే గురువారం రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని నీటితో శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే డబ్బు నిలువ ఉండదు. ఇంటిని శుభ్రం చేసిన నీటిని ఎవరు తొక్కకుండా నేరుగా డ్రైనేజీలోకి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటిని తుడిచిన నీటిని రోడ్డుపై కాకుండా నేరుగా డ్రైనేజీలో వేయాలి. ఈ నీటిని ఇతరులు తొక్కడం వల్ల అరిష్టం జరుగుతుందని అంటున్నారు. అలాగే పగిలిన బకెట్లో నీరు పోసి ఇంటిని శుభ్రం చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఇల్లు తుడిచిన ఫలితం ఉండదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular