https://oktelugu.com/

Balagam Heroine Kavya: డబ్బులిస్తే పడుకోవడానికి కూడా సిద్ధం అంటూ ‘బలగం’ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

ఇంటిమేట్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు ఇలా నిర్మాతలు ఏది కోరితే అది చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ కావ్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : June 7, 2023 / 01:24 PM IST

    Balagam Heroine Kavya

    Follow us on

    Balagam Heroine Kavya: ‘మనసంతా నువ్వే’ చిత్రం లో బాలనటిగా ‘తూనీగ తూనీగ’ అంటూ పాట పాడిన చిన్నారి మన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈమె పేరు కావ్య కళ్యాణ్ రామ్, ఆ సినిమాతో పాటుగా చిన్నతనం లో ఈమె పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బాలు’ సినిమాలో కూడా నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న కావ్య కళ్యాణ్ రామ్, ఇప్పుడు పెద్దయ్యాక హీరోయిన్ గా మారింది.

    2022 వ సంవత్సరం లో ‘ఉస్తాద్’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమె ‘బలగం’ మరియు ‘మాసూద’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇవి సక్సెస్ అయ్యాక ఆమె రేంజ్ మారిపోయింది. ముఖ్యంగా ‘బలగం’ చిత్రం ఈమెకి తెచ్చిన పాపులారిటీ మామూలుది కాదు, ఇప్పటి వరకు ఈమె చేసిన పాత్రలన్నీ సంసారం పక్షంగానే ఉన్నాయి.

    అయితే ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చాలా బోల్డ్ కామెంట్స్ చేసింది, ఆ కామెంట్స్ విన్న తర్వాత ఈమె గురించి అప్పటి వరకు ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. హాట్ సన్నివేశాల్లో నటించడానికి మీరు సిద్ధం గా ఉన్నారా అని కావ్య కళ్యాణ్ రామ్ ని అడగగా, డబ్బులిస్తే ఎలాంటి సన్నివేశాల్లో నటించడానికైనా రెడీ.

    ఇంటిమేట్ సన్నివేశాలు, బెడ్ రూమ్ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు ఇలా నిర్మాతలు ఏది కోరితే అది చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ కావ్య చేసిన బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. చిన్నప్పుడు అమాయకం గా మన ముందు కనిపించిన ఈ చిన్నారి యేనా ఇలా మాట్లాడింది అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. మరి కావ్య కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఈ ఆఫర్ ని దర్శక నిర్మాతలు వాడుకుంటారో లేదో చూడాలి.