Tim David T20 Record: బంతితో అతడికి దీర్ఘకాలిక శత్రుత్వం ఉన్నట్టుంది. బౌలర్లపై ప్రతీకారం తీర్చుకోవాలని కసి ఉన్నట్టుంది. అందువల్లే అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేశాడు. బంతిని మైదానం నలుమూలల పరుగులు పెట్టించాడు. తద్వారా పొట్టి ఫార్మాట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు.. అంతేకాదు కంగారు జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించి.. టి20 సిరీస్ అందించాడు. ఆటగాడి పేరు టీమ్ డేవిడ్.. ఆరడుగుల ఎత్తులో.. ఆజానుబాహుడి లాగా కనిపించే అతడు.. బంతిని కసి కొద్దీ బాదాడు. తద్వారా సరికొత్త రికార్డు సృష్టించాడు.
Also Read: ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి.. సీన్ కట్ చేస్తే ఇండియాను కోలు కోలేని దెబ్బతీశాడు
విండిస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో కంగారు జట్టు గెలుచుకుంది. ఇదే ఊపులో 5 t20 మ్యాచ్ ల సిరీస్ నూ సొంతం చేసుకుంది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే విజయం సాధించి.. కంగారు జట్టు అదరగొట్టింది. కంగారు జట్టులో టీమ్ డేవిడ్ 37 బంతుల్లో ఆరు ఫోర్లు, 11 భారీ సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.. తద్వారా విండీస్ విధించిన 215 పరుగుల టార్గెట్ ను 16.1 ఓవర్లలోనే ఫినిష్ చేశాడు.. డేవిడ్ చేసిన సెంచరీలో 90 పరుగులు సిక్సర్లు, ఫోర్ల ద్వారానే రావడం విశేషం. 87 పరుగులకే ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత దూకుడును ప్రదర్శించింది. వెస్టిండీస్ బౌలర్లు డేవిడ్, ఓవెన్ ను ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యా. దీంతో వారిద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఐదో వికెట్ కు రికార్డు స్థాయిలో 44 బంతుల్లో 128 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అంతేకాదు అజేయంగా నిలిచారు. దీంతో ఆతిథ్య జట్టుకు మరో ఓటమి తప్పలేదు.
Also Read: కరుణ్ నాయర్ కెరియర్ క్లోజ్ అయినట్టేనా?
వెస్టిండీస్ జట్టులో షై హోప్(102) సెంచరీ చేశాడు. కింగ్ హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 125 పరుగులు జోడించారు. అయితే ఆ తదుపరి మిగతా ప్లేయర్లు దూకుడుగా ఆడక పోవడంతో వెస్టిండీస్ జట్టు 214 పరుగులు చేసింది.. భారీగా పరుగులు చేసినప్పటికీ ఆ టార్గెట్ కాపాడుకోవడంలో విండిస్ జట్టు విఫలమైంది. ఈ సిరీస్ లో తొలి 20 మ్యాచ్ 3 వికెట్లు, రెండో టి20 మ్యాచ్ 8 వికెట్లు, మూడో మ్యాచ్ ను ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచి.. సిరీస్ సొంతం చేసుకుంది. డేవిడ్ 37 బంతుల్లో సెంచరీ చేయడం ద్వారా అరుదైన రికార్డు సృష్టించాడు. టి20లలో ఆస్ట్రేలియా జట్టు తరుపున అత్యంత వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. భారీగా పరుగులు చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో వెస్టిండీస్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా సిరీస్ చేజార్చుకున్నారు.