Paracetamol: సీజన్‌తో సంబంధం లేకుండా కొందరికి జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తుంటాయి. ఏదైనా ఎక్కువ పని చేసినా లేదా బాడీ బాగా అలసిపోయిన కూడా కొందరికి ఈజీగా జ్వరం వచ్చేస్తాది. ఏ మాత్రం బాడీ కొంచెం వేడి అయితే చాలు.. డాక్టర్‌ను సంప్రదించకుండా ఫస్ట్ పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడుతుంటారు. జ్వరం వస్తే వాడటం మంచిదే. కానీ వైద్యులను సంప్రదించకుండా ఎక్కువగా దీన్ని వాడటం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్లు అందరి ఇంట్లో కూడా ఫుల్‌గా ఉంటాయి. ఏ మాత్రం జలుబు చేసి జ్వరం వచ్చిన కూడా ఇంకో సెకండ్ ఛాన్స్ ఆలోచించకుండా మాత్రలు వేసేస్తారు. అయితే వీటిని అధికంగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. మరి దీర్ఘకాలికంగా పారాసిటమాల్ మాత్రలు వాడటం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పారాసిటమాల్‌ను వాడటం వల్ల ఆ నిమిషానికి జ్వరం తగ్గవచ్చు. కానీ ఆ తర్వాత గుండె, మూత్రపిండాల సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులకు ఈ సమస్య పెరుగుతుంది. అలాగే పెద్ద పేగు ఆరోగ్యం దెబ్బతినడం, మలద్వారం, జీర్ణ సమస్యలు, రక్తస్రావం, లోయర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ బ్లీడింగ్ సమస్యలు కూడా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం జ్వరానికి మాత్రమే కాకుండా కొందరు
తలనొప్పి, టెన్షన్ తలనొప్పి, మైగ్రేన్, వెన్నునొప్పి, రుమాటిక్, కండరాల నొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, పంటి నొప్పి, గొంతు నొప్పి, సైనస్ నొప్పి, శస్త్రచికిత్స అనంతర నొప్పి, జ్వరం వంటి వాటికి కూడా వాడుతున్నారు. ఇలా ప్రతీ చిన్న సమస్యకు డాక్టర్‌ను సంప్రదించకుండా పారాసిటమాల్ వాడటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
పారాసిటమాల్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలెర్జీ సమస్య వస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, గొంతు, నాలుక, ముఖం వాపు,
ఊపిరి ఆడకపోవడం, నోటి పూతలు, శ్వాస సమస్యలు, ఆస్పిరిన్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఇన్ఫెక్షన్లు సోకడం, కాలేయ సమస్యలు, వికారం, ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం, కళ్లు మంట, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి రక్తపోటు పెరిగిపోతుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు వైద్యులు ఈ పారాసిటమాల్‌ను వృద్ధులకు కీళ్ల సమస్యలకు ఇస్తుంటారు. దీనివల్ల కాలేయం, మూత్రపిండాల సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వృద్ధులు ఈ పారాసిటమాల్‌ను వాడవద్దు. ఎందుకంటే వయస్సు పైబడిన తర్వాత గుండె, జీర్ణ కోశ, కిడ్నీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. తక్కువ డబ్బులతో జ్వరం తగ్గిపోతుందని డాక్టర్‌ను సంప్రదించకుండా దీన్ని వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు అయితే వైద్యుల సూచనల మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.