Rohit and Kohli: క్రికెట్లో ఆటలోనే కాదు ఆటగాళ్లలోనూ మ్యాజిక్ లు ఉంటాయి. దీంతో వారు అనుకున్నది నెరవేర్చుకుంటారు. విరాట్ కోహ్లి కెప్టెన్సీ వదులుకోవడంపై పలు కథనాలు వచ్చిన మాట వాస్తవమే. బీసీసీఐకి విరాట్ కు మధ్య పొసగకనే అతడు వైదొలగాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు ఎవరైనా బలి కావాల్సిందే. అందులో టీమిండియా రాజకీయాలు ప్రత్యేకతంగా ఉంటాయి. ఎవరినైనా ఇంటి దారి పట్టించాలనుకుంటే సులువైన మార్గాన్ని ఎంచుకుని అతడి ఫిట్ నెస్ పై దెబ్బ కొట్టడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం టీమిండియాలో సఖ్యత కొరవడిందని అందరిలో విద్వేషాలు పొడచూపుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనపై అనేక అనుమానాలు వస్తున్నాయి.
కెప్టెన్ రోహిత్ శర్మకు విరాట్ కోహ్లికి మధ్య దూరం పెరిగిపోతోందని సమాచారం. దీంతోనే రోహిత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లలేదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో మొదట ప్రాక్టీసు సమయంలో చేతికి గాయమైందని, తరువాత కండరాలు పట్టేశాయని విభిన్న రకాలుగా మార్చి చెప్పడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్ కెప్టెన్సీలో ఆడటం ఇష్టం లేకే రోహిత్ సిరీస్ కు దూరమైనట్లు తెలుస్తోంది.
Also Read: రాత్రి సమయంలో వేడి నీళ్లు తాగితే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?
ఫిబ్రవరిలో జరిగే వెస్టిండీస్ కు రోహిత్ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. దీంతో రోహిత్ అందుబాటులోకి వస్తే విరాట్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాలు ఉండటంతో జట్టును ఎలా విజయతీరాలకు చేర్చుతారనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. 2023లో ప్రపంచ కప్ కోసం సన్నద్దమయ్యే సమయంలో గాయాలు, విభేదాలతో టీమిండియా గట్టెక్కేందుకు ఏ ప్రయత్నాలు చేస్తుందో తెలియడం లేదు.
జట్టుపై రోహిత్ కు పట్టు ఉంది. పైగా కోచ్ రాహుల్ ద్రవిడ్ అండ కూడా ఉండటంతో రోహిత్ రాణిస్తాడని అంచనా వేస్తున్నారు. కానీ విరాట్ కోహ్లితో ఉన్న విభేదాల కారణంగా జట్టు ఏమేరకు రాణిస్తుందో అనే భావన అందరిలో వస్తోంది. అసలు కోహ్లికి జట్టులో స్థానం ఉంటుందా అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి. రోహిత్ శర్మ బ్యాట్ తో విన్యాసాలు చేస్తున్నా ఆటగాళ్లను కూడా కంట్రోల్ చేయకుండా ఏమి సాధించలేడు. దీంతో వారి మధ్య సమన్వయం కుదిర్చేందుకు ప్రయత్నించాలి. అప్పడే విజయాలు సొంతమవుతాయి. ప్రత్యర్థి జట్టుకు పట్టు దొరకకుండా చేయడమే కెప్టెన్ లక్ష్యంగా ఉండాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో జరిగే సిరీస్ లో టీమిండియాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆటగాళ్లు కూడా అందుకు అనుగుణంగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాల దృష్ట్యా టీమిండియా మనుగడపై అనుమానాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళుతుందో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read: ‘ఎన్టీఆర్ ఆత్మ కనపడిందట.. మాట్లాడిందట..’ లక్ష్మీపార్వతీ ఏంటమ్మా ఇదీ!