Jobs: రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 69 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు జరగనుంది. railtelindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 600 రూపాయలు కాగా మిగిలిన వాళ్లకు దరఖాస్తు ఫీజు 1200 రూపాయలుగా ఉంది. ఫిబ్రవరి నెల 23వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగనుండగా ఈ పరీక్షలో 150 మార్కుల మల్లిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయని సమాచారం. https://www.railtelindia.com/images/careers/final%20vacancy%20notice-including%20backlog.pdf?ref=inbound_article వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
railtelindia.com వెబ్ సైట్ లో కెరీర్స్ ట్యాబ్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఉద్యోగానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్హత, సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, ఇతర ధృవీకరణ పత్రాల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు.
కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో 60 శాతం మార్కులు సాధించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.
[…] CM Jagan: ఏపీలో ప్రతిసారి చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చాలా భిన్నమైన విధంగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో కూడా ఇలాగే స్కూళ్ల విషయంలో వెనకడుగు వేసి చివరకు విమర్శలు ఎదుర్కొన్నది. సెకండ్ వేవ్ సమయంలో కూడా స్కూళ్లను మూసివేయకుండా ఉంటే.. అప్పుడు ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. చివరకు ప్రజల నుంచి విమర్శలు రావడంతో వెనక్కు తగ్గి స్కూళ్లను మూసివేసింది. […]