AP: ఏపీకి( Andhra Pradesh) గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో తాజాగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గత కొద్దిరోజులుగా ఏపీవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఆరు వరకు అధికంగా నమోదయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఉపరితల ఆవర్తనం పేరుతో గుడ్ న్యూస్ వచ్చింది. దీని ప్రభావంతో వాతావరణం చల్లగా మారుతుందని.. వేడిగాలుల ఉధృతి తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. రుతుపవనాలు నెమ్మదించడంతో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ద్వారా.. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి.
Read Also: విశాఖలో ‘అందాల విహారం’.. త్వరలో ఆ బస్సులు!
* ముందుగానే రుతుపవనాలు..
సుమారు 18 సంవత్సరాల తరువాత ఏపీకి ముందుగానే రుతుపవనాలు తాకాయి. రాష్ట్రమంతటా విస్తరించాయి. వాటి ప్రభావంతో అన్ని జిల్లాల్లో వర్షం పడింది. అయితే రుతుపవనాల గమనం మారడం, విస్తరించడం తగ్గడం వంటి కారణాలతో ఎండ తీవ్రత( summer temperatures ) మళ్లీ పెరిగింది. గతం మాదిరిగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడి గాలులు సైతం ఇచ్చాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. పరిస్థితి నడి వేసవిని తలపించింది. ఇటువంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు ఈ ద్రోణి విస్తరించి ఉంది.
Read Also: వాటివల్లే పంటలు.. అవన్నీ కాళేశ్వరంలో భాగమే: హరీశ్ రావు
* ఈరోజు చాలా జిల్లాల్లో వర్షం
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా విజయనగరం( Vijayanagaram), పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత కొనసాగనుంది. ఉక్కపోత తో పాటు 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా జిల్లాల్లో మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఈరోజు శ్రీకాకుళం, ఏలూరు,విజయవాడ, చిత్తూరు, తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు, కాకినాడ,రాజమండ్రి ప్రాంతాల్లో అదే మాదిరిగా ఉరుములతో కూడిన వర్షాలు పడే సూచన ఉంది.