
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 1.92 లక్షల కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం నుంచి రోడ్డు మార్గం లో రాష్ట్ర టీకా నిల్వల కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి వైద్య ఆరోగ్య శాక పర్యవేక్షణలో వివిధ జిల్లాలకు వ్యాక్సిన్ డోసులు తరలి వెళ్తాయి.