Homeజాతీయం - అంతర్జాతీయంకోవిడ్-19 మహమ్మారిపై మోదీ సమగ్ర సమీక్ష

కోవిడ్-19 మహమ్మారిపై మోదీ సమగ్ర సమీక్ష

దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు. రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఈ మహమ్మారి పరిస్థితిని సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచాలని రాష్ట్రాలను కోరారు. రెమ్ డెసివిర్ సహా మందులు, ఆక్సిజన్ లభ్యత గురించి తెలుసుకున్నారు. ఈ వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పీఎంఓ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి పరిస్థితిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్రంగా సమీక్షించారు. వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను అధికారులు సవివరంగా ఆయనకు తెలియజేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular