Anil Ravipudi
Anil Ravipudi : మన టాలీవుడ్ లో నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే, ముందుగా రాజమౌళి(SS Rajamouli) పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi) పేరు వినిపిస్తుంది. ఇప్పటి వరకు వీళ్లిద్దరు తీసిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. స్టార్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తీస్తూ మన తెలుగు ఆడియన్స్ నేటివిటీ కి తగ్గ కమర్షియల్ సినిమాలు తీయడం వదిలేసారు. ఈ గ్యాప్ ని అనిల్ రావిపూడి చాలా చక్కగా ఫిల్ చేశాడు. ఒక స్టార్ హీరో తన అభిమానులను సంతృప్తి పర్చడం కోసం కమర్షియల్ సినిమాని చేయాలని అనుకుంటే, కళ్ళు మూసుకొని అనిల్ రావిపూడితో సినిమా చెయ్యొచ్చు. అలాంటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రం 300 కోట్ల రూపాయిల గ్రాస్ కొట్టడంతో ఆయన పై నిర్మాతల్లో, హీరోల్లో నమ్మకం అమాంతం పెరిగిపోయింది.
Also Read : పర్వాలేదు అనిపించిన ‘సికిందర్’ 3వ రోజు వసూళ్లు..అసలు పరీక్ష మొదలు
ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఒక సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ ని రీసెంట్ గానే ఫైనల్ చేసి లాక్ చేశాడు. ఉగాది పర్వదినాన గ్రాండ్ లాంచింగ్ కూడా జరిగింది. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చిరు సినిమా కోసం ఆయన ఏకంగా 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇది సాధారణమైన విషయం కాదు. ఒకప్పుడు రాజమౌళి కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని ఆదుకునేవాడు కాదు. బాహుబలి నుండి ఆయన లాభాల్లో వాటాలు పంచుకుంటూ వస్తున్నాడు కానీ, అంతకు ముందు ఆయన రెమ్యూనరేషన్ కేవలం 10 నుండి 15 కోట్లు మాత్రమే.
ఇలా నేరుగా మన టాలీవుడ్ లో 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతున్నది త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అనిల్ రావిపూడి నే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ 10 కోట్లు. ఆ సినిమా తర్వాత ఏకంగా రెండింతలు తన రెమ్యూనరేషన్ ని పెంచేసాడు. చిరంజీవి సినిమా కూడా హిట్ అయితే భవిష్యత్తులో ఇక ఏ రేంజ్ లో ఆయన రెమ్యూనరేషన్ ని పెంచుతాడో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. ఇది అతిథి పాత్ర కాదట. సెకండ్ హాఫ్ మొత్తం వెంకటేష్ పాత్ర ఉంటుందట. ఆయనకు ఒక ఫైట్, పాట ని కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చిరంజీవి, వెంకటేష్ లాంటి నిన్నటి తరం సూపర్ స్టార్స్ ని ఒకే స్క్రీన్ పై చూసే అదృష్టం అతి త్వరలోనే కలగబోతుంది అన్నమాట.
Also Read : తనని అలియా భట్ తో పోల్చినందుకు అర్జున్ రెడ్డి హీరోయిన్ ఫైర్..ఎందుకంటే!