Shalini Pandey
Shalini Pandey : కొంతమంది హీరోయిన్లు కేవలం ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్స్ అయిపోతుంటారు, కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో అడ్రస్ లేకుండా పోతుంటారు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో వీళ్ళు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతుంటారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో షాలిని పాండే(Shalini Pandey) కచ్చితంగా ఉంటుంది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈమెను, డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ఆడిషన్స్ ద్వారా ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైంది. 2017 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా ఒక ప్రభంజనం సృష్టించింది. ఇందులో హీరో విజయ్ దేవరకొండతో(Vijay Devarakonda) సరిసమానమైన క్యారక్టర్ ని చేసింది షాలిని. ఇందులో ఈమె నటనను చూసిన తర్వాత భవిష్యత్తులో పెద్ద రేంజ్ కి వెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ కనీసం మీడియం రేంజ్ హీరోయిన్ గా కూడా తన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోలేకపోయింది ఈ బ్యూటీ.
Also Read : ‘అర్జున్ రెడ్డి’ తర్వాత నేను ఎంతో నరకం అనుభవించాను అంటూ హీరోయిన్ షాలిని పాండే షాకింగ్ కామెంట్స్!
రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆమె మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు సోషల్ మీడియా లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె మాట్లాడుతూ ‘తెలుగు, తమిళం, హిందీ ప్రేక్షకులు నన్ను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు, అందుకు నేను కృతజ్ఞురాలిని. కానీ కొంతమంది అభిమానులు మాత్రం నన్ను అలియా భట్(Alia Bhatt) తో పోల్చి తమ ప్రేమని చాటుకుంటూ ఉంటారు. అది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీ లో ఇప్పటికే ఒక అలియా భట్ ఉంది. ఆమె ఎంతో అద్భుతమైన నటి, ఆఫ్ స్క్రీన్ లో కూడా ఎన్నో ఉన్నతమైన విలువలు గల అమ్మాయి. ఆమె ఎంతో మందికి ఆదర్శప్రాయకం, నాకు కూడా అంతే. ఆమె నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. కానీ ఆమెతో పోలిస్తే మాత్రం నాకు ఇష్టం ఉండదు. నన్ను నన్నుగా గుర్తిస్తే చాలు, ఆ గుర్తింపు కోసమే పోరాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని పాండే.
ప్రస్తుతం ఈమె చేతిలో ధనుష్ హీరో గా నటిస్తున్న ‘ఇడ్లీ కధై’ అనే తమిళ చిత్రం ఉంది. ఈ సినిమాలో ధనుష్ హీరో గా నటిస్తూనే, దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం లో షాలిని పాండే కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా బాలీవుడ్ లో ఈమె ‘రాహు కేతు’ అనే సినిమా చేస్తుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె తమిళ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన జ్యోతిక తో కలిసి ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు సినిమాల్లో ఎదో ఒకటి సక్సెస్ అయినా ఆమె కెరీర్ కి బాగా ఉపయోగపడొచ్చు, చూడాలి మరి.
Also Read : అడ్రస్ లేని అర్జున్ రెడ్డి భామ…? కెరీర్ మళ్లీ పుంజుకోనుందా?