Amrik Sukhdev The Punjab: కష్టపడి చేసింది ఎన్నటికీ మనల్ని దాటిపోదు. కష్టపడకుండా వచ్చిన రూపాయి మన దగ్గర ఎప్పటికీ నిలవదు. చదువుతుంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ పలికిన డైలాగ్ గుర్తుకొస్తుంది కదా. ఈ డైలాగును జీవితానికి అప్లై చేసిన వారు విజయవంతమయ్యారు. గొప్ప వాళ్ళుగా ఎదిగారు. ఆ కోవలోకి వస్తారు అమ్రిక్ సుఖ్ దేవ్. పంజాబ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యవస్థను నిర్మించారు. దీని వెనుక ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు.. నేటి కాలం వాళ్లకి ఒక స్ఫూర్తి పాఠం.
అమ్రిక్ సుఖ్ దేవ్ ది పంజాబ్.. ఈయన నాటి కాలంలో పర్వాలేదనే స్థాయిలోనే చదువుకున్నారు. కారణాలు తెలియదు కానీ 1956 లోనే తన సొంత రాష్ట్రం పంజాబ్లో రోడ్డు పక్కన ఒక హోటల్ ఏర్పాటు చేశాడు. నాడు ఈయన హోటల్ ఏర్పాటు చేస్తే చాలామంది నవ్వారు. ఉద్యోగం చేసుకోక హోటల్ ఏర్పాటు చేయడం ఏంటని ఎగతాళి చేశారు. వారి మాటలకు తగ్గట్టుగానే అతడికి పెద్దగా గిరాకీ ఉండేది కాదు.. ఆ తర్వాత క్రమక్రమంగా అతని హోటల్ కు గిరాకీ పెరిగింది. హోటల్ కాస్త పెరిగింది దాబా లాగా రూపాంతరం చెందింది. ఒకప్పుడు టీ, టిఫిన్లు మాత్రమే విక్రయించే ఆ హోటల్లో ప్యూర్ పంజాబీ వంటకాలు లభించడం మొదలైంది. పరోట, రోటి, పన్నీర్ నుంచి మొదలు పెడితే ఎన్నో వంటకాలు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. తద్వారా డాబా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.. సరిగా ఇదే అవకాశాన్ని అమ్రిక్ సుఖ్ దేవ్ మరో స్థాకి తీసుకెళ్లాడు.. తన వ్యాపారానికి మరింత హంగులు అద్దాడు. ఆ వ్యాపారం క్రమ క్రమంగా పెరిగిపోయింది. అంతకుమించి అనే స్థాయికి ఎదిగింది.
గతంలో అతడు ఏర్పాటుచేసిన హోటల్ దాబా అయినట్టే.. ఆ రోడ్డు కూడా నేషనల్ హైవే అయిపోయింది. దీంతో వచ్చిపోయే ప్రయాణికులకు అది ఒక విడిది ప్రాంతంగా మారింది. పంజాబ్ నుంచి ఢిల్లీ వెళ్లేవారు.. ఢిల్లీ నుంచి పంజాబ్ వచ్చేవారు ఈ ప్రాంతంలో కచ్చితంగా ఆగుతారు.. అక్కడ ప్యూర్ పంజాబ్ స్టైల్ ఫుడ్ టేస్ట్ చేస్తారు. పంజాబీ రోటీలు, పన్నీర్ కర్రీ, జ్యూస్ లు కచ్చితంగా తాగుతారు. తద్వారా ఈ దాబా గిరాకి విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు.. కొంతమంది వినియోగదారులతో ఉండే ఈ హోటల్.. ఇప్పుడేకంగా 10,000 మంది కస్టమర్ల నమ్మకాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఏకంగా 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. దాదాపు 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది.. పంజాబీ లస్సీ నుంచి మొదలు పెడితే.. చికెన్ బిర్యాని వరకు ఇక్కడ లభించని వంటకం అంటూ లేదు..
ఒకప్పుడు ఈ హోటల్ పెడితే చాలామంది నవ్వారు.. ఎగతాళి చేశారు. ఇది నడవడం కష్టమేనని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు 100 కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిన తర్వాత నోరు మూసుకుంటున్నారు. అందులోనే తింటున్నారు. తింటున్నంత సేపు ఆ రుచిని ఆస్వాదిస్తున్నారు. వచ్చిన కస్టమర్లను చూసి తలదించుకుంటున్నారు. ఎందుకంటే ఒక పని చేయడం చాలా కష్టం. ఆ పని చేస్తున్న వారిని ఎగతాళి చేయడం సులభం. అందుకే కష్టానికి గౌరవించాలి. కష్టం చేస్తున్న వ్యక్తిని ప్రోత్సహించాలి. కాగా, అమ్రిక్ సుఖ్ దేవ్ వారసులు ప్రస్తుతం ఆ హోటల్ నిర్వహిస్తున్నారు. దానిని మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
View this post on Instagram