Allu Arjun Sandeep Reddy Vanga Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా ఎదిగిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga)…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాయి… ఇప్పటివరకు ఆయన చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి ఇండియాలో ఏ దర్శకుడు కి లేనంత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అప్పట్లో ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. మరి అల్లు అర్జున్ కూడా ఈ విషయం మీద స్పందించి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో సినిమా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చినప్పటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అది కార్యరూపం దాల్చే అవకాశాలు లేనట్టుగా తెలుస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ రెడ్డివంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అల్లు అర్జున్ సందీప్ రెడ్డివంగా సినిమాను క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో సందీప్ రెడ్డి వంగ తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం..భయపడ్డాను – హృతిక్ రోషన్
మరి ఏది ఏమైనా కూడా స్పిరిట్ సినిమా సక్సెస్ అయితే ఈ డైరెక్టర్ కి మరింత క్రేజ్ అయితే పెరుగుతోంది. ఇక దాంతో పాన్ ఇండియాలో ఉన్న స్టార్ట్ హీరోలందరూ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ సందీప్ మాత్రం అప్పుడు కూడా చాలా సెలెక్టెడ్ గా హీరోలను ఎంచుకుంటూ ముందుకు సాగుతాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
ఇక ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతోంది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తన ప్రభావాన్ని ఎలా చూపించబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఇదిలా ఉంటే రామ్ చరణ్ తో ఈయన సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
Also Read: ఈ ఏడాది వచ్చే సినిమాల్లో దేనికోసం వెయిటింగ్.. దేనికి హైప్ ఉంది..?
ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా క్యాన్సిల్ అయింది కాబట్టి రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో సందీప్ టాప్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి…