Telugu Movies 2025: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మరి ఇదే క్రమంలో ఈ నెలలో ఒకే రోజున రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండడం విశేషం… రజనీకాంత్ (Rajinikanth) హీరోగా చేస్తున్న కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమాకి పోటీగా ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమాని కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది, ఏ సినిమా డిజాస్టర్ గా మారుతోంది అనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక పెద్ద ఫైట్ గా పరిగణిస్తున్నారు. రవితేజ హీరోగా వస్తున్న ‘మాస్ జాతర’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…అలాగే సెప్టెంబర్ 25వ తేదీన ‘అఖండ 2’, పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇక అక్టోబర్ 2 వ తేదీన ‘ కాంతార చాప్టర్ 2’ కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇక డిసెంబర్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజాసాబ్’ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: పూరి – విజయ్ సేతుపతి మూవీ లో గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో…
మరి ఈ అన్ని సినిమాల్లో ఏ సినిమాకి ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ఉంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. ఇక దాంతో పాటుగా రజనీకాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వస్తున్న కూలీ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన అయితే లభిస్తోంది.
మరి ఈ రెండు సినిమాల మీద ఎక్కువగా బజ్ అయితే క్రియేట్ అయింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో మెప్పిస్తారా? ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ భారీ రికార్డులను క్రియేట్ చేయగలుగుతారా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
Also Read: ఈ ఏజ్ లో రజినీకాంత్ హీరోగా సినిమాలు చేయడం కరెక్టేనా..?
ఇక స్టార్ హీరోలందరు వాళ్ళ సినిమాలతో సక్సెస్ లను సాధించి తమ తదుపరి సినిమాల మీద మరింత ఎఫెక్ట్ గా ఫోకస్ పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతుందా లేదంటే ఈ సినిమాలతో డీలా పడిపోయి తమ మార్కెట్ ను పూర్తిగా కోల్పోతారా అనేది తెలియాలంటే మాత్రం ఈ మూవీస్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…