Tollywood Cine Workers Issues: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది… సినీ కార్మికులు సమ్మె చేయడానికి ఎందుకు పూనుకున్నారు. ఈనెల 4 వ తేదీన వాళ్ళు సమ్మె చేయబోతున్నాము అంటూ ఒక లేఖ ను రిలీజ్ చేసినట్టుగా అన్ని మీడియా గ్రూపుల్లో, న్యూస్ చానెల్స్ లో హెడ్డింగ్స్ అయితే వస్తున్నాయి. మరి నిజంగానే వాళ్ళు సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారా? నిజంగానే వాళ్ళ వేతనాలను పెంచే వరకు సినిమా షూటింగ్లకు బందు పిలుపునిచ్చారా అనేది కీలకమైన అంశంగా మారింది…ఇక వీళ్ళు రిలీజ్ చేసిన లేఖ మీద స్పందించిన ఫిలిం ఛాంబర్ సినీ కార్మికులు ఫెడరేషన్ తరుపు నుంచి లేఖను రిలీజ్ చేయడానికి అవకాశం లేదు అంటూ ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి ఎల్ దామోదర్ రావు ఒక సర్కులర్ ని జారీ చేశాడు…ఇక సినీ కార్మికులందరూ చేయబోతున్న ఈ సమ్మె మీద ఫిలిం ఛాంబర్ సైతం లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో సినీ కార్మికులందరూ కలిసి తమ వేతనాలను పెంచకపోతే మాత్రం సినిమా షూటింగ్లకు హాజరయ్యే అవకాశాలు లేవు. అలాగే అప్పటివరకు సినిమా షూటింగ్లకు బందు పిలుపునిస్తున్నామంటూ వాళ్ళు చెప్పిన మాటలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: విలన్ గా నాగార్జున.. అస్సలు ఒప్పుకోలేదు.. రజినీకాంత్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు!
ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా వల్ల ఖర్చులు కూడా పెరిగిపోయాయని అందువల్లే వాళ్ళకి వచ్చే వేతనాలు సరిపోవడం లేదని అందుకే వేతనాలు తప్పనిసరిగా పెంచాల్సిందే అంటూ తెలియజేస్తున్నారు. మరి దీనికి ఫిలిం ఛాంబర్ నుంచి ఇంకా ఏదైనా రెస్పాన్స్ వస్తుందా? సిరి కార్మికులను ఆదుకోవడానికి ఫిలిం ఛాంబర్ ఏం చేయబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
నిజానికి వాళ్ళు ఇచ్చే వేతనాలతో సినీ కార్మికులు తమ జీవితాన్ని గడపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని… సినిమానే నమ్ముకొని ఉన్న వాళ్లను అలా మోసం చేయడం కరెక్ట్ కాదు. హీరోలు, హీరోయిన్లకు కోట్లలో రెమ్యూనరేషన్ చెల్లిస్తున్న ప్రొడ్యూసర్స్ సైతం ఈ విషయం మీద ఒకసారి ఆలోచించి సినీ కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయాలి.
Also Read: సందీప్ రెడ్డి వంగ సినిమాను అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసుకున్నాడా..? కారణం ఏంటి..?
ఒక సినిమాని మనం థియేటర్లో చూస్తున్నాం అంటే దాని ముందు కనిపించే హీరో, హీరోయిన్లు మాత్రమే కాకుండా దాని వెనుక కొన్ని వందల మంది సినీ కార్మికులు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళందరు బాగుంటేనే సినిమా బాగుంటుంది. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకొని వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని కొంతమంది సినిమా విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…