Homeఎంటర్టైన్మెంట్Kobra: చెన్నైలో కోబ్రా షూటింగ్​ రీస్టార్ట్​.. వచ్చే ఏడాది వేసవిలోనే సినిమా రిలీజ్​

Kobra: చెన్నైలో కోబ్రా షూటింగ్​ రీస్టార్ట్​.. వచ్చే ఏడాది వేసవిలోనే సినిమా రిలీజ్​

Kobra: తమిళ స్టార్​ హీరో చియాన్​ విక్రమ్​ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన సినిమా హిట్​అయినా.. ఫ్లాప్​ అయినా.. ఆయన పాత్రలు మాత్రం జనాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. ఇందుకోసం తన ఆహార్యాన్నే కాదు.. తన రూపురేఖలనే పూర్తిగా మార్చేసుకుంటాడు విక్రమ్​. అపరిచితుడు, శివపుత్రుడు, ఐ, ఇంకొకడు ఇలా సినిమాలెన్నైనా సరే.. అందులో విక్రమ్​ ఉన్నాడంటే.. ఏదో కొత్తదనం ఉంటుందనే ఆశతోనే అభిమానులు ఇప్పటికీ థియేటర్​లోకి అడుగుపెడుతుంటారు.

kobra movie
Kobra

Also Read: ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారక్

కాగా, ప్రస్తుతం విక్రమ్​ హీరోగా నటిస్తున్న సినిమా కోబ్రా.. ఆసక్తికరమైన కథతో.. ఆర్​. అజయ్​ జ్ఞానవత్తు ఈ సనిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, కేజీఎఫ్​ ఫేమ్​ శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా కనిపించనుంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్​లు, టీజర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నింపాయి. ముఖ్యంగా వివిధ పాత్రల్లో కనిపించి ఫ్యాన్స్​ను షాక్​కు గురిచేశారు విక్రమ్​. కాగా, కరోనా వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్.. తాజాగా.. తిరిగి మొదలైంది.

సుమారు ఆరునెలల విరామం తర్వాత ఈ సినిమా చివరి షెడ్యూల్​ చెన్నైలోని గ్రీన్​మ్యాట్​ స్టూడియోలో ప్రారంభించారు మేరక్స్​ . ఈ విషయాన్ని దర్శకుడు జ్ఞానవత్తు సోషల్​మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. త్వరలోనే షూటింగ్​ పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది వేసవిలో మీ ముందుకొస్తామని తెలిపారు. కాగా, ఈ సినిమాలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్​ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.  మరి ఎప్పుడూ డిఫరెంట్​ గెటప్స్​తో అలరించే విక్రమ్​.. ఈ సినిమాలో ఎలా కనిపించనున్నారో తెలియాలంటే సినిమా వచ్చేవరకు వేచి చూడాల్సందే.

Also Read: చత్రపతి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version