Champions Trophy 2025 (1)
Champions Trophy 2025: గాయాల వల్ల పలువురు స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. దీంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ” క్రికెట్ అంటనే అసలైన మజా. పైగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడితే చూసేందుకు బాగుంటుంది. దిగ్గజ ఆటగాళ్లు పోటీపడి ఆడితే ఇంకా బాగుంటుంది. అలాంటిది దిగ్గజ ఆటగాళ్లు లేనప్పుడు మ్యాచ్ ఎలా చూస్తామంటూ” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
గాయాల పాలైన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా జట్టు ముందుంది. కెప్టెన్ తోపాటు ముగ్గురు ఆటగాళ్లు మెగా టోర్ని నుంచి దాదాపుగా నిష్క్రమించారు. కమిన్స్ కు గాయం అయిన నేపథ్యంలో స్మిత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు. టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మార్కస్ స్టోయినిస్ అయితే ఏకంగా వన్డేలకే వీడ్కోలు పలికాడు. పేస్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ గాయం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి దయనీయంగా ఉంది.
యువ ఆటగాడు టోర్నీకి దూరం
న్యూజిలాండ్ జట్టు ఆటగాడు రచిన్ రవీంద్ర కు తలకు గాయం కావడంతో.. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. పాకిస్తాన్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. న్యూజిలాండ్ పేస్ బౌలర్ లాకీ ఫెర్గూ సన్ కూడా చాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానమే. సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ అన్రిచ్ నోకియా వెన్ను నొప్పితో బాధపడుతూ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇప్పటివరకు ఆడిన 9 వన్డేలలో.. మూడు సెంచరీలు చేసిన పాకిస్తాన్ యువ ఆటగాడు సయిమ్ ఆయూబ్ చీలమండ గాయం వల్ల నుంచి నిష్క్రమించాడు. అతడు త్వరగా కోలుకుంటాడని .. పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ భావించింది. కాని క్షేత్రస్థాయిలో అలా జరగలేదు.
బుమ్రా కూడా..
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ బుమ్రా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.. కొంతకాలంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతడు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించకపోవడంతో.. అతడి స్థానంలో యువ ఆటగాడు హర్షిత్ రాణా కు జట్టు మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. బుమ్రా కోలుకున్నప్పటికీ.. ప్రస్తుతానికి విశ్రాంతి ఇవ్వడమే ఉత్తమం అని జట్ట మేనేజ్మెంట్ భావించింది.. ఇక షమీ కూడా ఇటీవల సర్జరీ చేయించుకుని జట్టులోకి వచ్చాడు. అతడి ఫామ్ కూడా పర్వాలేదు అనిపిస్తోంది. ఇక ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో కాలి వాపు వల్ల విరాట్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీకి ఆ గాయం తిరగబెడితే జట్టుకు ఇబ్బంది తప్పదు.
ఇక ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ కూడా గాయపడ్డాడు. టీమిండియాతో జరిగిన రెండవ వన్డేలో తొడ కండరాల నొప్పి వల్ల అతడు ఆడలేదు. తొలి వన్డేలో అతడు మెరుగ్గా రాణించాడు. రెండవ వన్డేలో కూడా అదే స్థాయిలో ఆడతాడని అందరూ భావించారు. కానీ గాయం వల్ల అతడు ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడేది అనుమానంగానే ఉంది.