Air Passengers : టిక్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ నవంబర్ నెలలో దేశంలో విమాన ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. డేటా ప్రకారం.. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, ఈ ఏడాది నవంబర్‌లో దేశీయ ప్రయాణీకుల సంఖ్యలో సుమారు 12 శాతం పెరుగుదల కనిపించింది. గరిష్ట సంఖ్యలో విమాన ప్రయాణాలను అందించడంలో ఇండిగో సంస్థ ముందంజలో ఉంది. ఆ తర్వాత ఎయిరిండియా, ఆకాస కంపెనీలు ఉన్నాయి. విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్యకు సంబంధించి ఎలాంటి గణాంకాలు బయటకు వచ్చాయో ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం.
నవంబర్‌లో పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య
ఎయిర్ ట్రాఫిక్‌కు పెరుగుతున్న డిమాండ్ మధ్య, భారతీయ విమానయాన సంస్థలు నవంబర్‌లో దేశీయ మార్గాల్లో 1.42 కోట్ల మంది ప్రయాణికులను తీసుకువెళ్లాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు 11.90 శాతం ఎక్కువ. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గణాంకాల ప్రకారం, దేశీయ మార్కెట్ వాటా పరంగా ఇండిగో అగ్రస్థానంలో ఉంది. దీని మార్కెట్ వాటా 63.6 శాతం. దీని తర్వాత ఎయిర్ ఇండియా (24.4 శాతం), అకాసా ఎయిర్ (4.7 శాతం), స్పైస్‌జెట్ (3.1 శాతం) ఉన్నాయి. నవంబర్‌లో అలయన్స్ ఎయిర్ వాటా 0.7 శాతం వద్ద స్థిరంగా ఉండగా, ఈ అన్ని ఎయిర్‌లైన్‌ల మార్కెట్ వాటా పెరిగింది.
11 నెలల్లో ఎంతమంది విమాన ప్రయాణం చేశారు?
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తన నెలవారీ నివేదికలో జనవరి-నవంబర్, 2024లో దేశీయ విమానయాన సంస్థలు 14.64 కోట్ల మంది ప్రయాణికులను రవాణా చేశాయని పేర్కొంది. గతేడాది ఇదే కాలంలో రూ.13.82 కోట్లతో పోలిస్తే ఇది 5.91 శాతం అధికం. నెలవారీగా చూస్తే 11.90 శాతం పెరుగుదల నమోదైంది. నవంబర్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.42 కోట్లకు పైగా ఉండగా, ఏడాది క్రితం ఇదే నెలలో దేశీయ విమానయాన సంస్థల ద్వారా 1.27 కోట్ల మంది ప్రయాణించారు.
పెరుగుతున్న విమాన ఛార్జీలు
మరోవైపు విమాన ఛార్జీల పెంపుదల కొనసాగుతోంది. విమాన ఇంధనం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. దీని కారణంగా విమానయాన సంస్థ నిర్వహణ వ్యయం పెరిగింది. దీని ప్రభావం టిక్కెట్ ధరల పెంపుపై కనిపిస్తోంది. అయితే, నెల మొదటి రోజున ఏటీఎఫ్ అంటే జెట్ ఇంధనం ధరలలో మార్పులు కనిపిస్తాయి. దేశంలోనే అత్యధికంగా చెన్నైలో కిలోలీటర్‌కు రూ.95,231.49గా ఉంది. ఢిల్లీలో కిలోలీటర్‌కు రూ.91,856.84, కోల్‌కతాలో రూ.94,551.63, ముంబైలో రూ.85,861.02గా ఉంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Air passengers how is the aviation sector how many people traveled this november even if the rates were increased
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com