Vijay Deverakonda : పుష్ప సిరీస్ తో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నార్త్ ఇండియా లో విపరీతమైన క్రేజ్ ఉందని అర్థమైంది. నిన్న మొన్నటి వరకు ప్రభాస్ పేరు వినిపించింది కానీ, ‘బాహుబలి 2 ‘ తర్వాత ఆయన 5 సినిమాలను విడుదల చేస్తే ఒక్కటి కూడా ‘బాహుబలి 2’ వసూళ్లను అందుకోలేకపోయాయి. కానీ ‘పుష్ప 2’ ఒకే ఒక్క దెబ్బతో బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని అధిగమించి, బాహుబలి 2 రికార్డుని కూడా అవలీలగా దాటేసింది. దీంతో ప్రస్తుతానికి మన టాలీవుడ్ నుండి పాన్ నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ తర్వాత మన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని అంటున్నారు అక్కడి విశ్లేషకులు.
ఇప్పటి వరకు ఆయన బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ క్రేజ్ మాత్రం ఊహాతీతం రేంజ్ లో ఉందట. ముఖ్యంగా నార్త్ ఇండియా చెందిన అమ్మాయిలు విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతున్నారు. హీరోయిన్స్ లోనే ఆయనకీ విపరీతమైన క్రేజ్ ఉంది. తమన్నా ఒక ఇంటర్వ్యూ లో నువ్వు ఒక హీరోకి లిప్ కిస్ ఇవ్వాలని అనుకుంటే ఏ హీరోకి ఇస్తావు అని అడగగా, ఆమె క్షణం కూడా ఆలోచించకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్తుంది. అలా జాన్వీ కపూర్, సోనమ్ కపూర్, కియారా అద్వానీ, పూనమ్ పాండే ఇలా ఎంతో మంది హీరోయిన్స్ కి ఆయన కలల రాకుమారుడు లాగా మారిపోయాడు. అందుకే ఒక్క సినిమా చేయకపోయినా కూడా విజయ్ దేవర కొండకి బాలీవుడ్ లో అంత క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు అక్కడి ఆడియన్స్ కి అర్జున్ రెడ్డి చిత్రమంటే బాగా ఇష్టం.
ఆ సినిమాని షాహిద్ కపూర్ రీమేక్ చేయడం, అది బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో విజయ్ దేవర కొండ పేరు కూడా బాలీవుడ్ లో మోత మోగిపోయింది. ఆ క్రేజ్ ని చూసే ఆయన తన లైగర్ చిత్రాన్ని విడుదల చేసాడు. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఈ సినిమాకి ఫుల్ రన్ లో పాతిక కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రానికి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదని అంటున్నారు. విజయ్ దేవరకొండ కి ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ క్రేజ్ ని గమనించిన అక్కడి ట్రేడ్, #VD12 థియేట్రికల్ రైట్స్ ని హిందీ వెర్షన్ కి గానూ 35 కోట్ల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. త్వరలో విడుదల అవ్వబోతున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఇక్కడ 40 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది.