https://oktelugu.com/

‘Game Changer’ Preview Show Talk : ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్..సెకండ్ హాఫ్ ఊహలకు అందదు..అభిమానులను పిచ్చెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ ప్రివ్యూ షో టాక్!

ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన మొదటి కాపీ ని ఇటీవలే అక్కడి ట్రేడ్ లోని ముఖ్యులకు ప్రివ్యూ షో వేసి చూపించారట. ఈ షో నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తమిళ ట్రేడ్ ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం.

Written By:
  • Vicky
  • , Updated On : December 27, 2024 / 08:50 PM IST

    Game Changer' Preview Show Talk

    Follow us on

    ‘Game Changer’ Preview Show Talk : పుష్ప 2 మేనియా ఇప్పుడు దాదాపుగా ముగిసిపోయినట్టే. ఇప్పుడు ఫ్యాన్స్, ఆడియన్స్, ట్రేడ్ ద్రుష్టి మొత్తం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వైపుకి వెళ్ళింది. సుమారుగా మూడేళ్ళ నుండి సెట్స్ మీదున్న ఈ చిత్రం ఎట్టకేలకు అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ జనవరి 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలకు ఆడియన్స్ నుండి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 30 వ తారీఖున ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కానుంది. జనవరి నాల్గవ తేదీన విజయవాడ లో భారీ లెవెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు.

    ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన మొదటి కాపీ ని ఇటీవలే అక్కడి ట్రేడ్ లోని ముఖ్యులకు ప్రివ్యూ షో వేసి చూపించారట. ఈ షో నుండి అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తమిళ ట్రేడ్ ప్రముఖుల నుండి అందుతున్న సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక పెఫెక్ట్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందో, అలా ఉందట. ఇంటర్వెల్ ఎపిసోడ్ రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ అని అంటున్నారు. ఇంటర్వెల్ లో రామ్ చరణ్ ముఖ్య మంత్రి అవుతాడని టాక్ వినిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే వింటేజ్ శంకర్ మాస్ విశ్వరూపం చూపించాడని, ఆడియన్స్ కచ్చితంగా షాక్ కి గురి అవుతారని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ అద్భుతమైన నటన ఫ్యాన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందట.

    ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ ఏమైపోతారో అంటూ సస్పెన్స్ లో ఉంచారట. హీరో తల్లిగా నటించిన అంజలి క్యారక్టర్ క్లైమాక్స్ లో ఆ రేంజ్ ట్విస్ట్ ఇస్తుందట. మొత్తానికి శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా అంటే మనం ఎలాంటి అంచనాలు పెట్టుకుంటామో, ఆ అంచనాలకు మించే ఈ సినిమా అద్భుతంగా వచ్చినట్టు సమాచారం. రామ్ చరణ్ నటనకి మాత్రం నేషనల్ అవార్డు కచ్చితంగా వస్తుందని అంటున్నారు. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో #RRR రికార్డ్స్ ని బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. #RRR చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 270 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ‘గేమ్ చేంజర్’ ఆ రేంజ్ కి అందుకుంటుందా లేదా అనేది చూడాలి.