Top 10 movies of 2024 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ 2024వ సంవత్సరంలో చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా స్టార్ హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించి పెట్టుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు…ఇక ఈ సంవత్సరంలో భారీ సక్సెస్ లను సాధించిన టాప్ 10 సినిమాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పుష్ప 2
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో చాలా తక్కువ రోజుల్లోనే 1700 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండస్ట్రీ హిట్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఇక ఈ సంవత్సరంలో ఈ సినిమా భారీ విజయంగా నమోదు అవ్వడమే కాకుండా అల్లు అర్జున్ కూడా నెంబర్ వన్ ఇండియన్ స్టార్ హీరో గా పేరు సంపాదించుకున్నాడనే చెప్పాలి…
కల్కి
ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో భారీ విజయాన్ని దక్కించుకున్న ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా అవతరించాడనే చెప్పాలి…
స్త్రీ 2
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ కి సరైన సక్సెస్ లైతే రాలేదు. ఇక స్త్రీ 2 సినిమాతో సక్సెస్ జర్నీ అందుకున్నారు. ఇక ఈ సినిమా 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను అయితే రాబట్టగలిగింది…
సైతాన్
మాధవన్, అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషించిన సైతాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో దొరికేక్కి దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టిందనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా మేకర్స్ కి భారీ లాభాలను కూడా తీసుకొచ్చి పెట్టాయి…
మహారాజా
విజయ్ సేతుపతి లీడ్ రోల్ లో వచ్చిన మహారాజా సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు 400 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని నమోదు చేసుకుంది…
హనుమాన్
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా 50 కోట్ల బడ్జెట్ తో దొరికేక్కి దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది…
ముంజుమ్మల్ బాయ్స్
ఇక మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముంజుమ్మల్ బాయ్స్ సినిమా చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కి అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాతో చిన్న బడ్జెట్ తో కూడా సినిమాలు తీసి పెద్ద విజయాలను సాధించవచ్చు అని మరోసారి ప్రూవ్ చేసింది…
కిల్
రాఘవ్ జుయెల్, తన్యా మణికంఠ లీడ్ రోల్ లో వచ్చిన కిల్ సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది…
సింగం ఎగైన్
అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో వచ్చిన సింగం ఎగైన్ సినిమా కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో ఈ ఇయర్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి గొప్ప గుర్తింపును దక్కించుకోవడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
లాపతా లేడీస్
ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కిన ‘లాపతా లేడీస్’ కూడా ఈ ఇయర్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో ఒకటిగా నిలవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా భారీ లెవల్లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడం అనేది మామూలు విషయం కాదు…ఇక మొత్తానికైతే ఈ సినిమా ఈ ఇయర్ లో డిఫరెంట్ జానర్ లో తెరకెక్కి మంచి సక్సెస్ ను సాధించింది…