మెహుల్ చోక్సి బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్రమంగా డొమినికాలోని ప్రవేశించారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆరోపణలు తీవ్రత దృష్ట్యా పిటిషన్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట […]

Written By: Suresh, Updated On : June 9, 2021 10:11 am
Follow us on

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ విచారణను డొమినికా హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అక్రమంగా డొమినికాలోని ప్రవేశించారన్న ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆరోపణలు తీవ్రత దృష్ట్యా పిటిషన్ ను తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చోక్సీ న్యాయవాదుల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల ఎదుట వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరుఫున న్యాయవాది బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఈ మేరకు కోర్టు విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.