
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. వరుసగా రెండు రోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 92,596 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. మరో 1,62,664 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడి మరో 2,219 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,89,069 కు చేరాయి. ఇందులో 2,75,04,126 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 3,53,528 మంది ప్రాణాలు వదిలారు.