అసోంలో గత వారం రోజులగా క్రమం తప్పకుండా భూ ప్రకంపణలు సంభవిస్తున్నాయి. గత గురువారం రాష్ర్రంలోని తేజ్ పూర్లో 3.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా ఇవాళ ఉదయం 7.5గంటలకు నగౌడ్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు పై దీని తీవ్రత 3.0 గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరగతేదని వెల్లడించింది. కాగా, కొన్నిరోజుల క్రితం 24 గంటల వ్యవధిలో పదిసార్లు భూమి కంపించింది. ఈ నెల 5న సాయంత్రం 7.22 గంటలకు సోనిత్ పూర్ లో 3.5 తీవ్రతతో భూమి కంపించింది.