
Student- Teacher: ప్రస్తుతం విద్యావిధానం మారింది. గతంలో పరీక్షలకు ఇంత హంగామా ఉండేది కాదు. ఓ అరగంట ఆలస్యమైనా పరీక్షకు అనుమతించే వారు. ఒక సంవత్సరం వృథా అవుతుందనే ఉద్దేశంతో ఆలస్యమైనా పరీక్ష రాయించేవారు. కానీ కాల క్రమంలో విద్యావిధానంలో మార్పులు వస్తున్నాయి. మనం ఎంత రాసినా కనీస మార్కులు వచ్చేవి కావు. ఇప్పుడు విచ్చలవిడిగా మార్కులు వేస్తున్నారు. నూటికి తొంబైలే ఎక్కువ. గతంలోనైతే మనం ఎంత రాసినా డెబ్బయి మార్కులు వస్తే ఎంతో ఎక్కువ.
పరీక్షల విధానంలో నిబంధనలు కఠినతరం చేశారు. ఏ పరీక్ష అయినా నిమిషం లేటయితే అంతే. ఇక విద్యాసంవత్సరం గంగలో కలిసినట్లే. అంతటి కఠినమైన నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా రావడం లేదు. ఎందుకంటే విద్యా సంవత్సరం పోతే మళ్లీ సంవత్సరం ఆగాలి. అలా చేస్తే ఒక సంవత్సరం వెనుకబడిపోవడం ఖాయం. అందుకే సాధ్యమైనంత వరకు ముందుగానే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకులే గోల అని గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్నారు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చాడు. పైగా హాల్ టికెట్ కూడా మరిచిపోయాడు. కానీ అతడి గురువులు మాత్రం విద్యాసంవత్సరం వృథా కావొద్దని అతడిని పరీక్ష హాల్లోకి పంపించారు. లేకపోతే అతడి చదువు సంవత్సరం పాటు ఆగిపోయేది. ఏడాది వట్టిగా ఉంటే ఎటు తోచదు. ఏవో ఇతర వ్యాపకాలతో భవిష్యత్ నాశనం అవుతుంది. అందుకే వారి గురువులు చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు.

విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వస్తే ఏం జరుగుతుందో తెలిసినా కూడా వారి అలవాటు మార్చుకోవడం లేదు. పరీక్షల కోసం ఏడాదంతా చదువుతారు. పరీక్ష రాయడానికి వచ్చే సమయం మాత్రం ఎందుకు మరిచిపోతారు. ఒకవేళ అతడిని పరీక్షకు అనుమతించకపోతే ఏమై ఉండేది. ఏడాది మొత్తం ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పటికైనా విద్యార్థులు సమయం విలువ తెలుసుకుని మసలుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం మరిచిపోకూడదు.